ఏపీ ప్రజలకు కేంద్రం శుభవార్త..వారందరికీ ఉచిత రేషన్ బియ్యం

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలకు కేంద్ర ప్రభుత్వం సంక్రాంతి పండగకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. జనవరి 18 వ తేదీ నుంచి ప్రజలందరికీ ఉచిత రేషన్‌ బియ్యం అందించనున్నట్లు ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం. ప్రతి కుటుంబంలో ఒక్కోక్కరికీ 10 కేజీల చొప్పున రేషన్‌ బియ్యం అందించాలని కేంద్రం ప్రకటన చేసింది.

గత నెలలో సరిపడా నిల్వలు లేనందున.. ఈ నెలలో రెండు నెలలకు కలిపి ఒక్కక్కరికీ 10 కేజీల బియ్యం ఇస్తామని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్‌ పేర్కొన్నారు. ఈ పథకం గత డిసెంబర్ నెలతోనే ముగియగా.. కేంద్ర ప్రభుత్వం మార్చి వరకు పొడిగించిందని గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇస్తున్న ఈ ఉచిత బియ్యం పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని గిరాజా శంకర్‌ సూచనలు చేశారు. కాగా.. ప్రధాన మంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన పథకాన్ని 2022 మార్చి వరకు పొడగిస్తూ.. మంగళవారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

 

Read more RELATED
Recommended to you

Latest news