ప్రభాస్ ని పెళ్లి చేసుకుంటానంటున్న కాజల్ అగర్వాల్..

-

లక్ష్మి కళ్యాణం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అయింది కాజల్ ఆగర్వాల్. అందంతో పాటు అభినయంతో కూడా ఆకట్టుకునే నటి కాజ‌ల్‌. అందులో సందేహం అక్కరలేదు. అందుకే ఇండస్ట్రీకి వచ్చి పది సంవత్సరాలు అయిన ఇంకా నిలదోక్కోకుంది. ప్రస్తుతం కమల్ హసన్ తో భారతీయడు 2 సినిమాలో నటిస్తుంది. తాజాగా మంచు లక్ష్మి వాఖ్యాత గా వ్యవహరిస్తున్నా ‘ఫిట్ అఫ్ విత్ స్టార్స్’ అనే షోలో పాల్గొంది.

అయితే ఈ కార్య‌క్ర‌మంలో కాజ‌ల్‌.. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిల‌ర్ ఆఫ్ టాలీవుడ్ ప్ర‌భాస్‌ను పెళ్లి చేసుకుంటానని కామెంట్స్ చేసింది. వాస్త‌వానికి మంచు లక్ష్మి సరదాగా.. అవకాశం వస్తే రాంచరణ్‌, ఎన్టీఆర్, ప్రభాస్‌లో ఎవరిని చంపుతావు? ఎవరితో లేచిపోతావు? ఎవరిని పెళ్లి చేసుకొంటావు? అని అడగగా కాజల్ సమాధానం ఇస్తూ.. రాంచరణ్‌ను చంపేస్తా… ఎన్టీఆర్‌తో లేచిపోతా… ఎందుకంటే వారిద్దరూ పెళ్లి అయింది కాబట్టి. ఇక ప్రభాస్‌కు పెళ్లి కాలేదు కాబట్టి ప్రభాస్ ని పెళ్లి చేసుకొంటానని చెప్పుకొచ్చింది కాజల్.

Read more RELATED
Recommended to you

Latest news