కేంద్రం గుడ్‌న్యూస్‌.. ఆ విద్యార్థులకు ఏడాదికి రూ. 2 వేల సాయం!

-

కేంద్ర ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. స్కూల్‌ ఎడ్యుకేషన్‌ పూర్తికాకుండానే బడి మానేసిన వారు మళ్లీ చదువుకునేందుకు ప్రోత్సహించడానికి ఈ స్కీంను ప్రవేశపెట్టింది. ఆ వివరాలు తెలుసుకుందాం.

ఈ పథకానికి అర్హత సాధించడానికి 16–19 ఏళ్ల వయస్సు ఉండాలి. ముఖ్యంగా డిస్టెన్‌ ్స విధానంలో పది
, ఇంటర్‌ చదువుకోవాలనుకునే వారికి సమగ్ర శిక్ష అభియాన్‌(ఎస్‌ఎస్‌ఏ) కింద ఏడాదికి రూ. 2 వేల మేర ప్రోత్సాహం అందించనున్నట్లు ప్రకటించింది కేంద్రం. ఈ స్కీంను ఈ సంవత్సరం నుంచే వర్తింపజేయనున్నట్లు కేంద్రం తెలిపింది. విద్యార్థులు ఈ పథకం ద్వారా పొందిన డబ్బును వారి అడ్మిషన్‌ ఫీజు, ఇతర మెటిరియల్‌ కోసం వినియోగించాలి. అయితే.. ఈ డబ్బులను విద్యార్థుల చేతికి ఇస్తే వారు అడ్మిషన్‌ పొందకుండానే ఇతర అవసరాలకు వాడుకోవచ్చని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

ఆ డబ్బులను విద్యార్థులకు ఏ రూపంలో ఇస్తే మంచిదో అని అధికారులు ప్రత్యామ్నాయ ఆలోచనలు చేస్తున్నారు. కేంద్రం తీసుకువచ్చే ఈ పథకం నిబంధనలపై స్పష్టత వస్తే అనేక మంది అభ్యర్థులు అడ్మిషన్‌ తీసుకునేందుకు ఆసక్తి చూపే అవకాశం ఉంటుంది. సార్వత్రిక విద్యాపీఠాల్లో ఈ విద్యాసంవత్సరంలో ప్రవేశాలు మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పథకంపై ఓ నిర్ణయానికి రానున్న కేంద్రం త్వరలో వాటి విధివిధానాలను ప్రకటించనుంది.

Read more RELATED
Recommended to you

Latest news