ఇవాళ ఏపీలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు ముందు మరోసారి రాష్ట్రానికి మరో రూ. 4,721 కోట్లు విడుదలయ్యాయి.
కేంద్ర పన్నులు, సుంకాల్లో రాష్ట్రాల వాటా కింద కేంద్ర ఆర్థిక శాఖ అన్ని రాష్ట్రాలకు కలిపి రూ.1,16,665 కోట్లు రిలీజ్ చేసింది. వీటిలో ఆంధ్రప్రదేశ్ కు రూ.4,721 కోట్లు, తెలంగాణకు రూ.2,452 కోట్లు వచ్చాయి. రూ.58,333 కోట్లను నెలవారిగా రాష్ట్రాలకు విడుదల చేసే బదులు, ఒకేసారి రెండు విడతల మొత్తాన్ని కలిపి ఇచ్చారు. రాష్ట్రాలకు మూలధన, అభివృద్ధి వ్యయానికి అవసరమైన నిధులు సమకూర్చడానికి వీలుగా ఒకేసారి రెండు విడతల మొత్తాన్ని విడుదల చేసినట్లు ఆర్థిక శాఖ తెలిపింది.