ప్రజలకు కేంద్రం షాక్‌.. గ్యాస్‌ సిలిండర్ల సబ్సిడీ ఎత్తివేత..

-

వంట గ్యాస్ సిలిండర్ల అంశంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. గ్యాస్ పై ఇప్పటివరకు అందిస్తున్న రాయితీని నిలిపివేసింది. ఇకపై వంట గ్యాస్ సిలిండర్ ధర ఎంతుంటే అంత వినియోగదారుడే పూర్తి ధర చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు చమురు శాఖ కార్యదర్శి పంకజ్ జైన్ తెలిపారు. ఇకమీదట ఉజ్వల పథకం లబ్దిదారులకు మాత్రమే గ్యాస్ పై సబ్సిడీ లభిస్తుందని వెల్లడించారు. ఉజ్వల పథకంలో భాగంగా లబ్దిదారులకు సాలీనా 12 సిలిండర్లు అందజేస్తారు. ఒక్కో సిలిండర్ కు రూ.200 రాయితీ ఇస్తున్నారు.

LPG price: Millions hit hard as cooking gas cost soars in India - BBC News

అయితే, సాధారణ వినియోగదారులకు వంట గ్యాస్ పై రాయితీ ఎత్తివేసిన నేపథ్యంలో, సామాన్యుడికి ఇది శరాఘాతం వంటి నిర్ణయమే అని చెప్పాలి. ఇప్పటికే దేశంలో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర రూ.1000 దాటింది. ఇప్పుడు ప్రభుత్వం రాయితీ తొలిగించిన నేపథ్యంలో, వినియోగదారుడిపైనే పూర్తి భారం పడనుంది.

Read more RELATED
Recommended to you

Latest news