ఆ యూట్యూబ్‌ ఛానెళ్లపై కేంద్రం నిషేధం..!

-

ఫేక్ న్యూస్ వ్యాప్తి చేసే మాధ్యమాలపై కేంద్ర సర్కార్ ఇప్పటికే చర్యలు చేపడుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు యూట్యూబ్ ఛానెళ్లపై కూడా నిషేధం విధించింది. అయితే కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు.. వార్తా సంస్థల మాదిరి థంబ్ నెయిల్స్, లోగోలు వాడుతూ ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తున్నాయని గమనించిన కేంద్రం వాటిపై నిషేధం విధించింది.

తాజాగా, కేంద్ర ప్రభుత్వం గురించి అసత్య వార్తలు ప్రసారం చేస్తోన్న మూడు యూట్యూబ్‌ ఛానెళ్లను గుర్తించి, నిషేధం విధించినట్లు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ తెలిపింది. న్యూస్‌ హెడ్‌లైన్స్‌, సర్కారీ అప్‌డేట్, ఆజ్‌ తక్‌ లైవ్‌ పేరుతో నిర్వహిస్తోన్నఈ మూడు ఛానెళ్లు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయని కేంద్రం స్పష్టం చేసింది. వీటికి సుమారు 33 లక్షల మందికిపైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నట్లు తెలిపింది.

ఈ మూడు ఛానెళ్లు ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీం ధర్మాసనం, సీజేఐ, ఈసీ, ఈవీఎంలు, ఆధార్‌, పాన్‌కార్డ్‌లతోపాటు వివిధ ప్రభుత్వ పథకాల గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయని కేంద్రం వెల్లడించింది. వీటిపై కేంద్రం ఆధ్వర్యంలోని  ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో  ఫ్యాక్ట్‌చెక్‌ విభాగం సుమారు 40 విడతలుగా ఫాక్ట్‌చెక్‌ నిర్వహించింది. ఈ క్రమంలో ఆయా ఛానెళ్లలో ఉన్న పలు వీడియోలు కేంద్ర ప్రభుత్వ విధివిధానాల గురించి అసత్యాలను ప్రచారం చేస్తున్నాయని గుర్తించింది. దీంతో వాటిపై నిషేధం విధించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news