దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న పరిస్థితుల్లో కేంద్రం రాష్ట్రాలతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కాసేపట్లో అన్ని రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులతో కేంద్ర మంత్రి హర్షవర్దన్ సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులు, నివారణకు చేపడుతున్న చర్యలపై చర్చించనున్నారు.
కరోనా కట్టడికి కేంద్రం చేపట్టిన చర్యలు, తీసుకున్న నిర్ణయాల గురించి రాష్ట్రాలకు వివరించనున్నారు కేంద్ర మంత్రి. మరో పక్క దేశంలో కరోనా విలయ తాండవం చేస్తోంది. కుప్పలు తెప్పలుగా కేసులు పెరుగుతున్నాయి. వరుసగా మూడో రోజూ కేసులు రెండు లక్షలు దాటేశాయి. 24 గంటల్లో రెండు లక్షలా 34692 కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులో 1341 మంది మృత్యువాత పడ్డారు. దేశ వ్యాప్తంగా పాజిటివ్ కేసులు కోటి 45 లక్షల 26 వేల 609 కి చేరుకున్నాయి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య దాదాపు 17 లక్షలుగా ఉంది.