ఏపీ ఎక్సైజ్ శాఖలో మరో భారీ స్కామ్..నేతల జోక్యం పై ఆరా

-

ఏమో ఏపీ ఎక్సైజ్‌శాఖలోని కొందరు సిబ్బంది కొత్తరకం దందాకు తెరతీశారు. నేతలంతా ఎన్నికల హడావిడిలో ఉన్నారు. ప్రభుత్వ పెద్దలు కరోనా నియంత్రణపై ఫోకస్‌ పెట్టారు. ఇదే టైమ్‌ అనుకున్నారో ఏమో సరికొత్త లిక్కర్‌ స్కామ్‌ కి తెర తీశారు. అయితే ఈ స్కామ్ లో అధికారుల పాత్రే ఉందా లేక రాజకీయపార్టీల నేతల హస్తం కూడా ఉందా అన్న దాని పై హాట్ హాట్ గా చర్చ నడుస్తుంది.


ఏపీ ఎక్సైజ్‌ శాఖలో మద్యం దుకాణాల్లో ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిన పనిచేస్తున్న సిబ్బందిని గుప్పెట్లో పెట్టుకుని అక్రమ దందా కి తెర తీశారు. క్వార్టర్‌ బాటిళ్లపై ఉండే స్టిక్కర్లను తీసి..తక్కువ రేటు ఉన్న బాటిళ్లకు అతికించి ఎక్కువకు అమ్మేస్తున్నారు. దాదాపు ప్రతి దుకాణంలోనూ 400 నుంచి 500 క్వార్టర్‌ బాటిళ్లు ఈ విధంగా విక్రయిస్తున్నట్టు సమాచారం. ఒక్కో దుకాణంలో యావరేజ్‌ గా 20 వేల రూపాయలు వెనకేసుకుంటున్నట్టు చెబుతున్నారు. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం లో ఈ తరహా వ్యవహారం బయటకు రావడంతో ఎక్సైజ్ స్కాం బట్టబయలైంది.

ప్రభుత్వ యంత్రాంగం మొత్తం తిరుపతి ఉపఎన్నికపై ఫోకస్‌ పెట్టింది. ఇంకోవైపు కరోనా నియంత్రణ చర్యల్లో మిగతావాళ్లు బిజీగా ఉన్నారు. ఇదే సరైన సమయం అని భావించిన అక్రమార్కులు భారీ స్థాయిలో అక్రమార్జనకు తెరలేపారు. సంబంధిత శాఖా మంత్రి నారాయణ స్వామి సైతం తిరుపతి ఉపఎన్నిక బిజీలో ఉన్నారు. కొందరు ఉన్నతాధికారులకు ఈ స్కామ్ గురించి తెలిసినా లైట్ తీసుకున్నట్లు తెలుస్తుంది. అధికారుల నిర్లక్ష్యం పై ఎక్సైజ్‌ శాఖలో రకరకాలుగా చర్చించుకుంటున్నారు.

ఈ స్కామ్‌లో పలువురు జిల్లా స్థాయి అధికారులు మొదలుకుని.. రాష్ట్ర స్థాయిలో కీలకంగా ఉండే అధికారుల ప్రమేయం కూడా ఉండి ఉండొచ్చనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి రాజకీయ నేతల అండ కూడా ఉందా లేదా అన్న చర్చ జరుగుతోంది మరి ఈ స్టిక్కర్‌ స్కామ్‌లో ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news