BREAKING : ఇకనుండి పోలీస్ స్టేషన్ బెయిల్ రద్దు.!

-

పోలీసు శాఖలో అవినీతిని అరికట్టడానికి కేంద్ర న్యాయ శాఖ సిఆర్‌పిసి 41ఎ ను సవరించింది. అలాగే పోలీస్ స్టేషన్ బెయిల్‌ను రద్దు చేసింది. ఇక నుంచి కోర్టుల ద్వారా మాత్రమే బెయిల్స్ మంజూరు చేయబడతాయి. మరియు దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేయబడింది.  ఇప్పటి వరకు నిందితులకు ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్షను విధించబడే కేసులలో పోలీస్ స్టేషన్లో జామీను పై బెయిల్ ఇచ్చే అవకాశం ఉండేది. ఈ బెయిల్ ఇచ్చే నెపంతో  పోలీస్‌స్టేషన్లలో బాధితులను దోచుకుంటున్నారని, నేరస్తులకు వెసులు బాటు విపత్కర పరిస్థితులకు దారితీస్తున్నాయన్న తీవ్రమైన ఆరోపణలు.. దేశంలో అనేక ప్రాంతాలలో పలు సంఘటనలు వెలుగులోకి వచ్చాయి.

ఈ నేపథ్యంలోనే  41ఎ సిఆర్‌పిసి సవరణ పై కేంద్రం న్యాయశాఖ దృష్టి సారించింది. కాగా చిన్న కేసులను పరిష్కరించడానికి కోర్టులకు సమయం ఉండకపోవచ్చని ఒక విభాగం వాదించింది. ఏదేమైనా, ప్రతి కేసులో నిందితులు బెయిల్ కోసం కోర్టులను సంప్రదించవలసి ఉంటుందని, కొత్త నిబంధన ప్రకారం ఎస్‌హెచ్‌ఓ కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరుపరచాల్సి ఉంటుంది. ఈమేరకు కేంద్ర న్యాయశాఖ పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news