గత కొన్ని రోజులుగా తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇటీవల కేసీఆర్ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో కేఆర్ఎంబీ, ట్రిబ్యునత్ ఏర్పాట్లపై ప్రశ్నిస్తూ కేసీఆర్ పలు వ్యాఖ్యలు చేశారు. ట్రిబ్యునల్ కావాలనే కేంద్రం ఏర్పాటు చేయడం లేదని ఆరోపణలు చేశారు. తాజాగా ఈ అంశంపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్పందించారు. ఏపీ, తెలంగాణ మధ్య నీటి పంపకాల కోసం కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ట్రిబ్యునల్ ఏర్పాటు గురించి గతంలోనే కేసీఆర్ సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించారని కేంద్రమంత్రి తెలియజేశారు. ట్రిబ్యునల్ ఏర్పాటులో జాప్యానికి తెలంగాణ ప్రభుత్వమే కారణం అని ఆయన అన్నారు. కోర్టులో కేసు ఉన్నందు వల్లే తాము ఈ విషయంపై నిర్ణయం తీసుకోలేమని గతంలోనే చెప్పాం అని అన్నారు. రెండు రోజుల్లో పిటీషన్ వెనక్కి తీసుకుంటాం అన్నారు. నెల క్రితమే పిటీషన్ ఉపసంహరించుకునేందుకు సుప్రీం కోర్ట్ కూడా అనుమతి ఇచ్చింది. కానీ 8 నెలలు అయినా పిటీషన్ వెనక్కి తీసుకోలేదు. ప్రస్తుతం పిటీషన్ వెనక్కి తీసుకొని నెల రోజులే అయిందని షెకావత్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం లేట్ చేస్తే నాదా బాధ్యతా..? అని ప్రశ్నించారు. ఇరు రాష్ట్రాల సీఎంల అంగీకారం తరువాతే బోర్డుల పరిధిని నిర్ణయించాం అన్నారు.
ట్రిబ్యునల్ ఏర్పాటు జాప్యానికి తెలంగాణ ప్రభుత్వమే కారణం.- కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్
-