EPF చందాదారుల పెన్షన్‌ పథకంపై కేంద్రం కీలక వ్యాఖ్యలు

-

ఈపీఎఫ్ 2014 సవరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అధ్యయనం చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపింది. 2014 సవరణకు ముందు అధిక పింఛను పొందేందుకు ఈపీఎస్‌లో చేరని వారికి సుప్రీంకోర్టు నాలుగు నెలల గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై రాజ్యసభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి రామేశ్వర్‌ తేలి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.

కోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలిస్తున్నామని రామేశ్వర్ తెలిపారు. పెన్షన్‌ పథకంపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలుసా? అంటూ వచ్చిన మరో ప్రశ్నకూ ఆయన బదులిచ్చారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో న్యాయ, ఆర్థిక, గణాంకాలకు సంబంధించిన చిక్కులు ఉన్నాయని ఆ సమాధానంలో పేర్కొన్నారు.

ఈపీఎఫ్‌ఓ దగ్గర ఈ ఏడాది మార్చి 31 నాటికి కార్పస్‌ ఫండ్‌ కింద రూ.18,64,136 కోట్లు ఉందని కేంద్రమంత్రి తేలి పార్లమెంట్‌కు తెలిపారు. ఇందులో రూ.11,37,096.72 కోట్లు ఎంప్లాయీ ప్రావిడెండ్‌ ఫండ్‌ స్కీమ్‌, 1962లో ఉండగా.. రూ.6,89,210.72 కోట్లు పెన్షన్‌ స్కీమ్‌, 1995లో ఉన్నాయి. మరో రూ.37,828.56 కోట్లు ఎంప్లాయీ డిపాజిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ స్కీమ్‌, 1976లో ఉన్నాయని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news