సినిమాకు సంబంధించి దర్శకులు ఏం చెబితే అదే చేస్తానని సూపర్ స్టార్ నయనతార అన్నారు. సినిమా విషయంలో రియలెస్టిక్, కమర్షియల్ అనే వ్యత్యాసం ఉంటుందని.. దాన్ని కొంతమంది గ్రహించాలని చెప్పారు. ఓ సినిమాలో నయన్ మేకప్ గురించి నటి చేసిన వ్యాఖ్యలపై ఈ బ్యూటీ రియాక్ట్ అయ్యారు.
నేను దర్శకుల నటిని. సినిమాకు అనుగుణంగా వాళ్లు ఏం చెబితే అదే చేస్తాను. డ్రెస్సింగ్, మేకప్, హావభావాలు.. ఇలా ప్రతి విషయాన్ని వాళ్లు చెప్పిన విధంగా ఫాలో అవుతా. అయితే, గతంలో నేనొక ఇంటర్వ్యూ చూశా. అందులో ఓ హీరోయిన్ నా డ్రెస్సింగ్ స్టైల్, మేకప్ గురించి కామెంట్స్ చేసింది. ఆమె పేరు ఇప్పుడు చెప్పాలని లేదు. ఆస్పత్రి సీన్‌లోనూ నేను మేకప్, లిప్‌స్టిక్, హెయిర్‌స్టైల్ చక్కగా వేసుకోవడాన్ని ఆమె తప్పు పట్టింది. అయితే, నేను చెప్పేది ఒక్కటే సినిమాల విషయంలో చిన్న వ్యత్యాసం ఉంటుంది. కమర్షియల్, రియలెస్టిక్ మూవీస్ ఉంటాయి. రియలెస్టిక్ చిత్రంలో నటిస్తే తప్పకుండా లుక్స్ పరంగా జాగ్రత్తలు పాటించాలి. కమర్షియల్ సినిమాలో దర్శకుడు హీరోయిన్స్‌ను ఇలాగే స్టైలిష్‌గా చూపిస్తారు’’ అంటూ నయనతార చాలా సున్నితంగా ఆ నటికి కౌంటర్ విసిరారు.
గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాళవిక మాట్లాడుతూ.. ‘‘అగ్రకథానాయిక, సూపర్‌స్టార్‌గా పేరు సొంతం చేసుకున్న ఓ నటి ఆస్పత్రి సన్నివేశంలోనూ ఫుల్ మేకప్ వేసుకుని నటించింది. లిప్‌స్టిక్, హెయిర్‌స్టైల్.. అన్ని చక్కగా అలంకరించుకుంది. ఆ సీన్స్ చూసి నేను షాక్ అయ్యాను. ఎంత కమర్షియల్ సినిమా అయితే మాత్రం కాస్త వాస్తవికంగా ఉండేలా చూడాలి కదా అనిపించింది’’ అని కామెంట్స్ చేశారు.