ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వైయస్ జగన్ తీసుకున్న నిర్ణయాలకు కేంద్ర ప్రభుత్వ పెద్దల నుండి మరియు మంత్రి నుండి తీవ్రస్థాయి చాలా విషయాలలో వ్యతిరేకత వ్యక్తమైంది. ఇటువంటి నేపథ్యంలో తాజాగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలో వెంకటాచలం లో స్వర్ణ భారత్ ట్రస్ట్ లో ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది.
ఆ సందర్భంలో జనవరి 20, 21వ తేదీల్లో తెలుగు అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేసిన సందర్భంలో ఈ కార్యక్రమానికి హాజరవ్వాలని జనవరి ఒకటవ తారీఖున కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి లెటర్ రాయడం జరిగింది. అయితే అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు ఉన్నట్లు తాను హాజరు కాలేనని జగన్ సమాధానం ఇవ్వటం జరిగింది. ఇలా చెప్తూనే, తెలుగు విశిష్ఠ అధ్యయన కేంద్రం, అక్కడ పెట్టడం పై తన అభ్యంతరం తెలియ చేస్తూ, జనవరి 17న, కేంద్ర మంత్రికి తిరిగి జవాబు ఇచ్చారు.
అక్కడ ఎలా ఏర్పాటు చేస్తారు, నేను అడిగితే, ప్రభుత్వ భూమి ఇచ్చే వాడిని కదా ని చెప్పినట్టు సమాచారం. దీంతో జనవరి ఒకటవ తారీఖున నేను లెటర్ రాస్తే అప్పుడు చెప్పకుండా చాలా లేటుగా అభ్యంతరకరంగా అంతా అయిపోయాక ఇప్పుడు చెప్పడం ఏంటి అని జగన్ పై కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ సీరియస్ అయ్యారట. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలుగు కేంద్ర అకాడమీ కోసం తన సొంత భూములు ఇవ్వటం జరిగింది.