ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ వైసీపీ పై తెలుగుదేశం పార్టీ నేతలు ఇష్టానుసారం అయిన వ్యాఖ్యలు చేస్తున్నారు. అధికారంలో ఉన్న సమయంలో అక్రమ కేసులతో వైసిపి పార్టీకి చెందిన చాలా మందిని తెలుగుదేశం పార్టీ నాయకులు అరెస్టు మరియు హత్యలు కూడా చేయించారని అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైసిపి పార్టీ అనేక ఆరోపణలు చేయడం జరిగింది.
అయితే తాజాగా ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుడు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అదేవిధంగా అధికారంలో లేకపోయినా మళ్లీ అధికారంలోకి వస్తే వైసిపి పార్టీ పై పగ తీర్చుకుంటానని ప్రతీకార చర్యలు తప్పవని వైసిపి పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరూ మిగలరని బహిరంగంగా కామెంట్ చేయడంతో తెలుగుదేశం పార్టీ బుద్ధి బయటపడిందని రెడ్ హ్యాండెడ్ గా దొరికారు అని…ఇలాంటి నాయకులు ఉండబట్టే రాజకీయాల్లో విలువలు లేకుండా పోతున్నాయని వైసీపీ నేతలు కౌంటర్ లు వేస్తున్నారు.
కాగా మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు సమావేశం లో మాట్లాడిన సందర్భంలో ప్రస్తుతం రాష్ట్రంలో టిడిపి పార్టీ నాయకులపై మరియు కార్యకర్తలపై కావాలనే దురుద్దేశంతో తప్పుడు కేసులు బనాయించి కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని విమర్శించాడు. తర్వాత మనం అధికారంలోకి వచ్చాక మనపై తప్పుడు కేసులు పెట్టినవారిపై అంతకు రెట్టింపు కేసులు పెడదామని, అవసరమైతే చంద్రబాబు దగ్గర కూడా గట్టిగా మాట్లాడతానని కార్యకర్తలకు హామీ ఇచ్చారు పుల్లారావు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం తమపై నాలుగు కేసులు నమోదు చేస్తే, తాము వచ్చాక 10 కేసులు పెడతామని హెచ్చరించారు. ఇప్పుడు వైసీపీకి కొమ్ము కాస్తున్న అధికారులను కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించారు. దీంతో ప్రత్తిపాటి పుల్లారావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి.