కరోనా వ్యాక్సిన్‌పై పుకార్లు నమ్మొద్దు !

-

కరోనా వ్యాక్సినేషన్ మీద వస్తున్న పుకార్లను నమ్మవద్దని కేంద్ర ప్రభుత్వం కోరింది. కోవాగ్జిన్ , కోవిషీల్డ్ టీకాలు రెండూ సురక్షితమేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కొందరు వైద్య సిబ్బంది ఈ వ్యాక్సిన్ తీసుకోవడానికి నిరాకరిస్తూ ఉండడం బాధిస్తోందని వారందరూ కూడా వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు రావాలని కోరింది. ఇక మరో పక్క దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ  వేగవంతం చేశారు. ఇక కరోనా వ్యాక్సిన్ ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు . 18 శాతం మాత్రమే ప్రతికూలత అంశాలు కనిపించాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఇక వ్యాక్సినేషన్ విషయంలో భారత్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. మొదటి రోజున మొత్తం రెండు లక్షల ఏడు వేల మంది టీకా వేయించుకున్నారు.  అమెరికాలో వ్యాక్సిన్ ప్రక్రియ మొదలుపెట్టిన వారంలో ఐదు లక్షల మందికి పైగా భారత్ లో మూడు రోజులలోనే ఆ సంఖ్యకు చేరుకుంది. అలాగే దేశవ్యాప్తంగా ప్రస్తుతానికి యాక్టివ్ గా ఉన్న కేసులు కంటే వ్యాక్సిన్ తీసుకున్నవారికి సంఖ్య ఎక్కువగా ఉందని కేంద్రం ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news