కోవిడ్ వ్యాక్సినేషన్ తర్వాత.. జాగ్రత్త !

-

రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే పలువురు వైద్యులు, సిబ్బంది, ఆశావర్కర్లు టీకాను వేసుకున్నారు. అయితే కోవిడ్ గండం నుంచి గట్టెక్కామని అనుకుంటే మాత్రం కష్టం. ఆ తర్వాతి పరిణామాలు భయాందోళన కలిగిస్తున్నాయి. కోవిడ్ నుంచి కోలుకున్న కొందరిలో మెదడులో రక్తప్రసరణ జరగకపోవడం, రక్తం గడ్డ కట్టడం లాంటి ప్రాణాంతక సమస్యలు వెంటాడుతున్నాయి.

covid vachsination

బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్..
ఇటీవల కోవిడ్ నుంచి 55 ఏళ్లు వ్యక్తి డిశ్చార్జీ అయ్యాడు. కొంత కాలం తర్వాత అతడికి దగ్గు, ఆయాసం వంటి సమస్యలు వచ్చాయి. దీంతో అతడు వైద్యులను సంప్రదించాడు. డాక్టర్లు పరీక్షలు నిర్వహించి ఊపిరితిత్తులకు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకిందని వెల్లడించారు. కోవిడ్ సమయంలో తీసుకున్న స్టెరాయిడ్లే ఈ సమస్యకు కారణమని నిర్ధారించారు. ‘సూడోమొనాస్’ అనే ఈ ఇన్ఫెక్షన్ తో ఊపరితిత్తుల్లో రంధ్రం ఏర్పడుతుంది. ఇలా పాడైపోయిన ఊపరితిత్తులను తొలగించాల్సి ఉంటుందని వైద్యులు పేర్కొన్నారు.

బ్రెయిన్ హెమరేజ్ (మెదడులో రక్తస్రావం)..
ఓ మహిళలకు అధిక రక్తపోటు. కోవిడ్ సోకినా చికిత్స తీసుకుని సమర్థవంతంగానే క్యూర్ అయింది. అయితే ఆ తర్వాత కొద్ది రోజులకు ఆమె కుడి వైపు చేయి, కాలిలో బలహీనత సమస్య తలెత్తింది. దీంతో ఆమె వైద్యులను సంప్రదించగా మెదడులో రక్తం గడ్డకట్టిందన్నారు. రక్తం గడ్డకట్టే తత్వం ఉన్నవారికి డీడైమర్, పీటీఐఎన్నార్, ఏపీటీటీ లెవల్స్ అనే ప్రయాణాలను పరీక్షిస్తూ యాంటీ కాగ్యులెంట్ మందును ఇస్తారు. రక్తం గడ్డకట్టే తత్వం లేని వాళ్లు, అధిక రక్తపోటు సమస్య ఉన్నవారికి ఈ మందులు ఇవ్వడం వల్ల రక్తస్రావ సమస్యలు వస్తాయి. సర్జరీతో రక్తపు గడ్డలను తొలగించవచ్చు.

ఊపిరితిత్తుల్లో సమస్య..
మధుమేహం ఉన్నవారికి కోవిడ్ సోకినప్పుడు కార్టికో స్టెరాయిడ్ మందులు వేస్తారు. ఈ మందును శరీర బరువు ఆధారంగా అందించాలని దీన్నే ‘పల్స్ కార్టికోస్టెరాయిడ్ థెరపీ’ అంటారు. అయితే శరీర బరువుకి మించి స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్ల ఊపిరితిత్తుల్లో ‘మ్యూకార్ మైకోసిన్’ అనే ప్రాణాంతక ఫంగల్ ఇన్ఫెక్షన్ బారిన పడొచ్చు. ఇలా జరగకుండా ఉండేందుకు ఊపిరితిత్తులను బ్రాంఖోస్కోపితో శుభ్రపరిచి నమూనా పరీక్షలు చేయాలి. అప్పుడు ఎలాంటి సమస్య ఉండదు.

కండరాల్లో నొప్పి..
కరోనా నుంచి కోలుకున్నవారిలో తలెత్తె మరో సమస్య కండరాల్లో నొప్పి. రక్తనాళాల్లో రక్త ప్రసరణ జరగక రక్తం గడ్డ కడుతుంది. దీన్నే ‘థ్రాంబోసిస్’ అంటారు. కోవిడ్ చికిత్సలో యాంటీ కాగ్యులెంట్ మందులు వాడటం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. కొందరిలో సులభంగా రక్తం గడ్డకడుతుంది. అప్పుడు వీరికి యాంటీ కాగ్యులెంట్స్ తప్పనిసరిగా ఇవ్వాలి. కానీ కోవిడ్ సోకిన ప్రతి ఒక్కరికి ఈ మందులు ఇస్తే ఇలాంటి దుష్ర్పభావాలు బయటపడుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news