ఛాయ్, కాఫీ అంటే ఇష్టపడని వాళ్లు చాల తక్కువ మంది ఉంటారు. అసలు చాలామందికి వారీ డే టీ/ కాఫీతోనే స్టాట్ అవుతుంది. వేడి వేడి టీ గొంతులో పడితే ఆహా..అదో తెలియని ఆనందరం. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు బాల్కనీలో కుర్చుని మాంచి అల్లం టీ తాగితే వస్తుంది మజా ఆ అనుభూతి టీ ప్రియులకు బాగా తెలుసు. అసలు టైం కీ టీ తాగకపోతే ఏదో వెలితిగా అనిపిస్తుంది. కానీ కేవలం తిండీతిప్పలు మాని టీ మాత్రమే తాగి ఒతికే ఒక వ్యక్తి ఉన్నారని మీకు తెలుసా.
బీహార్‌కు చెందిన ఓ మహిళ కేవలం టీ తాగి మాత్రమే బతుకుతోంది. ఆమె ఆహారమే తినదు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు దాదాపు 31 సంవత్సరాలుగా ఆమె ఇలానే జీవనం సాగిస్తోందట..వింటానికే చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. నమ్మశక్యంగా అనిపించకపోయినప్పటికీ ఇది పచ్చి నిజం అండీ
బీహార్‌లోని హాజీపూర్‌కు చెందిన కిరణ్ దేవి అనే మహిళ దాదాపు 31 సంవత్సరాలుగా కేవలం టీ తాగి మాత్రమే బతుకుతోంది. అక్కడివారంతా ఆమెను అందరూ ఛాయ్‌వాలీ అని పిలుస్తుంటారు. అయితే.. కిరణ్ దేవి ఇలా కేవలం టీ మాత్రమే తాగి ఆహారం తీసుకోకపోవడానికి పెద్ద కారణమే ఉంది. అదేంటంటే.. ఆమె భర్తకు టీ అంటే చాలా ఇష్టమట. పెళ్లయినప్పటి నుంచి భార్య చేతి టీ తాగితే గానీ కిరణ్ దేవి భర్త ఏ పనైనా చేశావాడట. అలా భార్యాభర్తలిద్దరూ కలిసి రోజూ ఉదయం, సాయంత్రం టీ తాగేవాళ్లు.
కిరణ్ దేవికి అప్పట్లో ఇలా టీ మాత్రమే తాగే అలవాటు లేదు..మనలానే ఆమె కూడా ఆహారం తీసుకునేది. ఆమె జీవితంలో ఓ విషాద ఘటన ఆమెను ఇలా మార్చేసింది. సాఫీగా సాగిపోతున్న కిరణ్ దేవి జీవితంలో ఆమె భర్త మరణం ఆమెను కుంగదీసింది. భర్త గురించే తలుచుకుంటూ ఆమె బాధపడని రోజంటూ లేదు. భార్యాభర్తల మధ్య అంత అన్యోన్యం ఉండేది. అంతగా ప్రేమించే భర్త దూరం కావడం ఆమెను శోకసంద్రంలోకి నెట్టేసింది.
కొన్నాళ్లకు ఆ షాక్ నుంచి కోలుకుని మాములు మనిషి అయిన కిరణ్ దేవి ఓ నిర్ణయం తీసుకుంది. భర్త జ్ఞాపకంగా కేవలం టీ మాత్రమే తాగి బతుకుతోంది. బతికినన్నాళ్లూ అలానే బతకాలని ఆమె ఫిక్సయిపోయింది. అలా అప్పటి నుంచి.. అంటే దాదాపు 31 సంవత్సరాలుగా కిరణ్ దేవి టీ మాత్రమే తాగి జీవిస్తోంది. ఈరోజికి కూడా ఎక్కడికి వెళ్లినా, ఏ పనిచేసినా ముందు టీ తాగకుండా మొదలుపెట్టదు.