ఆలోచన ఉంటే ఏదైనా సాధించవచ్చు అని ఇప్పుడు యువత నిరూపిస్తున్నారు.. కొందరు ఆల్రెడీ వారి ఆలోచనలతో ఉన్నత శిఖరాలను కూడా అందుకున్నారు.ముఖ్యంగా అమ్మాయిల విషయంలో అయితే చాలానే జరిగాయి..మహా మొండి వాళ్ళు, పట్టుదల, ధైర్యం ను కలిగి ఉంటారు. ఏదైనా గట్టిగా అనుకుంటే మాత్రం మధ్యలో వదిలెయ్యరు. ఎలాగైనా కొందరు జీవితాన్ని పణంగా పెట్టి ముందుకు వెళుతున్నారు.. అందులో చాయ్ వాలా ప్రియాంక ఒకరు.డిగ్రీ పట్టా పుచ్చుకుని కాళ్లరిగేలా ఉద్యోగం కోసం తిరిగింది.. ఆమె శ్రమకు ఫలితం చివరకు చాయ్‌వాలీగా మారింది.
ఇంతై.. వటుడింతై అన్నట్లు జీవితంలో దూసుకుపోతోంది. గ్రాడ్యుయేట్ చాయ్ వాలీగా గుర్తింపు దక్కించుకున్న ప్రియాంక ఇప్పుడు టీ స్టాల్ ను మూసేసింది. బీహార్ పాట్నా లో ఉమెన్స్ కాలేజీ దగ్గర ఓ టీ స్టాల్ నడిపిస్తోంది ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్ ప్రియాంక గుప్తా. 2019లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని ఉద్యోగ ప్రయత్నాలు చేసింది. కానీ, ఈ రెండేళ్ల లో ఎలాంటి ఫలితం కనిపించలేదు. ఈ క్రమంలో.. ఎంబీఏ చాయ్‌వాలా ప్రఫుల్ బిలోర్ కథనం ఆమెకు స్ఫూర్తి ఇచ్చిందట..
అందుకే చాయివాలీ కూడా ఉండాలన్న ఉద్దేశం తో ఈమధ్యే ఈ 24 ఏళ్ల అమ్మాయి టీ స్టాల్ ఓపెన్ చేసింది. ఇందుకు తల్లిదండ్రులు, స్నేహితుల సహాకారం కూడా లభించింది. అయితే ఈ గ్రాడ్యుయేట్ చాయ్‌వాలీ కథనం.. ఓ పెద్ద మనిషిని కదిలించిందట. అందుకే ప్రియాంక తన బిజినెస్ ను మరింత విస్తరించుకునేందుకు సాయం చేయడానికి ముందుకు వచ్చారు. ప్రియాంకకు ఫుడ్ ట్రక్‌ను అందించారు. దాంతో పేరును అందించిన టీ కొట్టును పూర్తిగా మూసేసింది.కొంతమంది వర్కర్స్ తో కలిసి ఫుడ్ ట్రక్‌ను నడిపిస్తోంది. దాంతో ప్రియాంక కథ మరోసారి సోషల్ మీడియా లో వైరల్‌గా మారింది..ఇప్పుడు ఈ అమ్మడు ఇంకే బిజినెస్ చేస్తుందో అనే ఆసక్తి మొదలైంది..