3 రోజుల కేటాయించలేవా అంటూ అనసూయ పై ఫైర్ అయిన చలాకి చంటి..!!

బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమం గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రసారం అవుతున్నప్పటికీ బెస్ట్ కామెడీ ఎంటర్టైన్మెంట్ షో గా జబర్దస్త్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ షోలో యాంకర్ గా వ్యవహరిస్తున్న అనసూయ హాట్ యాంకర్ గా మంచి ఇమేజ్ ను సొంతం చేసుకోవడమే కాకుండా తన చలాకీతనంతో మాటలతో ఎంతోమందిని ఆకట్టుకుంటూ ఉంటుంది. అంతేకాదు సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు బాగా పాపులర్ అయ్యే ఈ ముద్దుగుమ్మ తనపై ఎవరైనా నెగిటివిటీ ప్రచారం చేస్తున్నారని తెలిస్తే లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తూ మరింత పాపులర్ అవుతూ ఉంది.

ఇకపోతే వరుస సినిమాలు చేస్తూ స్టార్ మా చానల్లో కూడా పలు షో లకు యాంకర్ గా వ్యవహరిస్తున్న అనసూయ తన బిజీ షెడ్యూల్ తో తన కెరీర్ను కొనసాగిస్తుంది. ఇకపోతే తాజాగా అక్కడ సమయాన్ని ఎక్కువగా గడుపుతున్న నేపథ్యంలో జబర్దస్త్ ను కొనసాగించలేకపోవడం గమనార్హం. ఈ క్రమంలోని ఆమె జబర్దస్త్ ను వీడుతున్నట్లు అందుకు సంబంధించిన ప్రోమో ను కూడా నెట్టింట వదిలారు. ఇకపోతే జబర్దస్త్ నుంచి విడుదలైన ప్రోమోలో అనసూయ వెళ్ళిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక అంతే కాదు ఈ ఎపిసోడ్లో ఈమెకు ఇదే చివరి వారం అన్నట్లుగా ప్రోమోలో చూపించారు . జబర్దస్త్ వేదికపై ఉన్న కమెడియన్ లందరూ అలాగే జడ్జ్ ఇంద్రజ కూడా ఆమెకు వీడ్కోలు పలికినట్లు మనం చూడవచ్చు.

అనసూయ లాగా లేడీ గెటప్ లో వచ్చిన తాగుబోతు రమేష్ .. ఈ షో నుంచి వెళ్ళిపోతున్నానని ఒక స్కిట్ చేశాడు .అందులో భాగంగానే చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడు కూడా మీ తల్లి గారికి ఇచ్చే జబర్దస్త్ షో చేశారు కదా ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోతున్నారు మేడం అంటూ వెంకీ అడిగాడు. కానీ ఆమె ఏ మాత్రం సమాధానం ఇవ్వలేదు. ఇక తర్వాత ఇంద్రజ కూడా ఎమోషనల్ అవుతూ తన బాధను వ్యక్తపరిచింది. ఇక ఈ క్రమంలోనే చలాకి చంటి కూడా నెలలో కేవలం మూడు రోజులు జబర్దస్త్కు కేటాయించలేవా అంటూ ఒకవైపు ఫైర్ అవుతూనే ఆమెను ప్రశ్నించడం మొదలుపెట్టాడు కానీ ఆమె ఏమాత్రం సమాధానం ఇవ్వకుండా.. కుదరదు అన్నట్టుగా ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. ఇక ఇందుకు సంబంధించిన ప్రోమో కూడా నెట్టింట బాగా వైరల్ అవుతూ ఉండడం గమనార్హం.