విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్న చలపతిరావు శనివారం రాత్రి అకస్మాత్తుగా మరణించారు నటించిన ఈయన టాలీవుడ్ లో 1200 కు పైగా సినిమాల్లో నటించిన చలపతిరావు మరణం అందరిని కలిసివేసింది. ఎప్పుడు అందర్నీ పలకరిస్తూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే ఈయన చనిపోవడం సినీ అభిమానులను ఎంతగానో కలిసివేసింది. అయితే ఇతనే నవ్వు గనుక ఎంతో విషాదం ఉందంటూ ఈ సందర్భంగా పలువురు గుర్తు చేసుకుంటున్నారు..
చలపతిరావు ఎంతో హుందాగా ఉంటూనే చాలా సరదాగా ఉంటారు. తన చుట్టూ ఉన్న వారిపై ఛలోక్తులు విసురుతుంటారు. కానీ ఆయన్ని దగ్గరగా చూసిన వారు మాత్రం ఎప్పుడూ నవ్వుతుండే ఆయన చిరునవ్వు వెనుక మాత్రం ఎంతో విషాదం దాగి ఉందని అంటుంటారు. మనసులో ఎంత బాధ ఉన్నప్పటికీ ఆయన దాన్ని బయటకు కనపడనీయరని చెబుతారు.
ఈయన సతీమణి పేరు ఇందుమతి. వీరికి ఇద్దరు కుమార్తెలు. ఓ కొడుకు.. చెన్నైలో ఓ రోజు ఇందుమతి చీరకు నిప్పు అంటుకొని ఆమె తీవ్రంగా గాయపడ్డారు ఈ సమయంలో ఎంతగా ప్రయత్నించినా మూడు రోజుల తర్వాత మరణించారు అయితే ఈ బాధ అతనిని ఎంతగానో కలిసి వేసింది తర్వాత ఎందరో చెప్పిన అతను వరకు పెళ్లి చేసుకోకుండా పిల్లల కోసమే ఉండిపోయారు.. అలాగే తర్వత కొన్నాళ్లకు ఆయనకు చాలా పెద్ద యాక్సిడెంట్ అయ్యింది. దాదాపు తొమ్మిది నెలల పాటు చక్రాల కుర్చీకే పరిమితం అయ్యారు.. మరో సందర్భంలో మహిళలను ఉద్దేశించి ఓ ప్రెస్ మీట్‌లో చలపతి రావు చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యి.. సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. దాంతో ఆయనకు చాలా బాధ కలిగి సూసైడ్ చేసుకుని చనిపోవాలని కూడా అనుకున్నారట.