చండీగఢ్ యూనివర్సిటీలో ఆందోళన విరమించిన విద్యార్థులు

-

దేశవ్యాప్తంగా దుమారం రేపిన చండీగఢ్ యూనివర్సిటీ విద్యార్థినుల న్యూడ్ వీడియోల లీక్​ కేసులో ఇద్దరు నిందితులను శిమ్లా పోలీసులు అరెస్టు చేశారు. వీరి అరెస్టుతో విద్యార్థులు తమ నిరసనలను ఇవాళ తెల్లవారుజామున విరమించారు. అధికారులు, పోలీసులు పారదర్శకంగా దర్యాప్తు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనలు ఆపేశారు. దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తామని వర్సిటీ యాజమాన్యం హామీ ఇవ్వడంతో కాస్త కూల్ అయ్యారు.

మరోవైపు విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు వార్డెన్​లను సస్పెండ్ చేశారు. ఈ వివాదం నేపథ్యంలో ఈనెల 24 వరకు తరగతులను రద్దు చేశారు. అంతేకాకుండా విద్యార్థుల డిమాండ్లు, సమస్యలు పరిష్కరించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేశారు.

చండీగఢ్ యూనివర్శిటీ విద్యార్థినిల ప్రైవేట్ వీడియోలు లీక్​ చేసిన కేసులో అరెస్టయిన నిందితురాలికి సన్నీ మెహతా ప్రియుడు. సన్నీ.. శిమ్లాలోని రోహ్రు నివాసి. అతడు బీఏ వరకు చదివాడు. ప్రస్తుతం తన సోదరుడితో కలిసి ఓ కేక్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. మరో నిందితుడు రాంకజ్ వర్మ.. శిమ్లాలోని థియోగ్ నివాసి. అతడు ఓ ట్రావెల్ ఏజెన్సీలో పనిచేస్తున్నాడు. వీరిద్దరిని శిమ్లా పోలీసులు అరెస్టు చేసి పంజాబ్ పోలీసులకు అప్పగించారు.

Read more RELATED
Recommended to you

Latest news