చండీగఢ్ మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటిన ఆప్… మ్యాజిక్ ఫిగర్ కు దూరంగానే అన్ని పార్టీలు

-

చండీగఢ్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం ఫలితాలను విడుదల చేసింది. ఆప్ ఈ ఎన్నికల్లో సత్తా చాటింది. 35 స్థానాలు ఉన్న చండీగఢ్ మున్సిపల్ కార్పోరేషన్లో ఆప్ 14 వార్డుల్లో విజయం సాధించగా… బీజేపీ 12 స్థానాల్లో విజయం సాధించి సత్తా చాటాయి. కాంగ్రెస్ 8 స్థానాల్లో, శిరోమణి అకాళీధళ్ కేవలం ఒకే స్థానంలో విజయం సాధించాయి.

ఆప్, బీజేపీ మధ్య హోరా హోరీ పోరు జరిగినట్లు తెలుస్తోంది. ఈ రెండు పార్టీలు నువ్వానేనా అన్న రీతిలో పోటీ పడ్డాయి. అయితే 35 స్థానాలు ఉన్న చండీగఢ్ మున్సిపల్ కార్పోరేషన్లో ఏ పార్టీకీ మ్యాజిక్ ఫిగర్ రాలేదు. అధికారం ఏర్పాటు చేయాలంటే 18 స్థానాల్లో ఖచ్చితంగా విజయం సాధించాలి. అయితే ప్రస్తుతం ఏ పార్టీ మ్యాజిక్ ఫిగర్ టచ్ చేయకపోవడంతో హంగ్ పాలక మండలి ఏర్పడే అవకాశం ఉంది. ఆప్ మాత్రమే 14 సీట్లు సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది.

అయితే మూడు వ్యవసాయ చట్టాలపై హర్యానా, పంజాబ్ రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేసినా.. బీజేపీ 12 స్థానాల్లో గెలుపొందడం అందర్ని ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం చండీగఢ్ ఫలితాలు రానున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో పంజాబ్ ఎన్నికలు ఉండే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news