షిఫ్ట్ చేంజ్: రేవంత్ ఇటు..బండి అటు..కేసీఆర్‌ని ఇరికిస్తున్నారుగా!

-

తెలంగాణలో సీఎం కేసీఆర్‌పై ప్రతిపక్షాలు ముప్పెట దాడి చేస్తున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రతిపక్షాలు పోరాడుతున్నాయి. గతం కంటే ఇప్పుడు ప్రతిపక్షాలు వేగంగా పుంజుకున్నాయి. ఓ వైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్‌లు కేసీఆర్ టార్గెట్‌గా దూకుడుగా రాజకీయం చేస్తున్నాయి. ఈ విషయంలో బీజేపీ ఓ అడుగు ముందు ఉందని చెప్పొచ్చు. ఓ రేంజ్‌లో కేసీఆర్‌ని టార్గెట్ చేసి బీజేపీ ముందుకెళుతుంది. అయితే మధ్యలో కాంగ్రెస్ కాస్త స్పీడ్ తగ్గింది…కానీ మళ్ళీ ఇప్పుడు దూకుడుగా ఉండటం మొదలుపెట్టింది.

bandi sanjay kumar revanth reddy
bandi sanjay kumar revanth reddy

ఓ వైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మరోవైపు టి‌పి‌సి‌సి చీఫ్ రేవంత్ రెడ్డిలు..కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి ముందుకెళుతున్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. అయితే ఇక్కడ ఇద్దరు అధ్యక్షులు డిఫరెంట్ దారిలో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. మొన్నటివరకు బండి…ధాన్యం కొనుగోలు అంశంపై పెద్ద ఎత్తున పోరాటం చేసిన విషయం తెలిసిందే. అటు టీఆర్ఎస్ సైతం..బీజేపీకి కౌంటర్లు ఇస్తూ వచ్చింది. కానీ ఎక్కడకక్కడ బీజేపీ మాత్రం…టీఆర్ఎస్‌పై దాడి చేస్తూనే ఉంది.

ఇలా ధాన్యం అంశంపై పోరాడిన బండి…ఇప్పుడు నిరుద్యోగల సమస్యపై పోరాటం చేయడం మొదలుపెట్టారు. తాజాగా నిరుద్యోగుల కోసం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాల‌యంలో బండి సంజ‌య్ నిరుద్యోగ‌ దీక్ష చేయ‌నున్నారు. ఇక బండి దీక్షకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. అన్నిరంగాల్లో దూసుకెళ్తున్న తెలంగాణలో యువతను రెచ్చగొట్టేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ దొంగ దీక్షకు సిద్ధమవుతున్నారని ఫైర్ అయ్యారు.

ఇలా బండి నిరుద్యోగుల కోసం పోరాటం మొదలుపెడితే..అటు ధాన్యం అంశంపై రేవంత్ రెడ్డి పోరాటం మొదలుపెట్టారు. ఇదివరకే రేవంత్..నిరుద్యోగుల కోసం జంగ్ సైరన్ కార్యక్రమం నిర్వహించారు. ఇప్పుడు ధాన్యం అంశంపై గళం విప్పారు. రైతులని వరి వేయొద్దని చెప్పి…కేసీఆర్ మాత్రం తన ఫామ్ హౌస్‌లోని 150 ఎకరాల్లో వరి ఎలా వేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎర్రవెల్లిలో రచ్చబండ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అయితే ఏదేమైనా బండి, రేవంత్‌లు షిఫ్ట్‌లు మార్చుకుంటూ..సమస్యలపై పోరాటం చేస్తూ..కేసీఆర్‌ని ఇరికిస్తున్నట్లు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news