మహాకూటమిలో సీట్లను కేటాయించేది…చంద్రబాబు?

-

తెలంగాణలో జరగనున్న ఎన్నికల్లో తెరాస ఓటమి లక్ష్యంగా ఏర్పటు చేసిన మహా కూటమిలో తెదేపా కీలక పాత్ర పోషిస్తోంది. కాంగ్రెస్ పెద్దన్నగా బయటకు కనపడుతుందే కానీ మొత్తం అమరావతి నుంచి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కథ నడుపుతున్నారంటూ..పలువురు నేతలు ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ తొలి జాబితాలో సీట్ల కేటాయింపులోనూ బాబు తన పాత్ర పోషించారని అసమ్మతి వాదులు ఆరోపిస్తున్నారు. తెలంగాణలో రోజరోజుకి ప్రభావం తగ్గుతున్న తేదపాతో కాంగ్రెస్ కలవడం పెద్దతప్పుగా ఆ పార్టీ నేతలు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఇందులో భాగంగానే బాబు ఒత్తిడి వల్లే గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఏమాత్రం పోటీ లేని నియోజకవర్గాల్లో సైతం పార్టీ అధిష్టానం కొందరు కాంగ్రెస్‌ ప్రముఖుల సీట్లను పెండింగ్‌లో పెట్టిందని తెలుస్తోంది. కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితాకు చంద్రబాబు ఆమోదం కోసమే రాహుల్‌ గాంధీ దూతగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అశోక్‌ గెహ్లాట్‌ ఏపీ రాజధాని అమరావతిలో ఆయనతో సమావేశమయ్యారన్న ప్రచారం సోమవారం ప్రకటించిన మొదటి జాబితాతోనే తేటతెల్లమైందని  ఈ పరిణామాలన్నింటిని గమనించినట్లైతే మహాకూటమి  అధికారంలోకి వస్తే చంద్రబాబు చెప్పినట్లే మంత్రివర్గం కూర్పు సహా ఇతర అంశాలు ముడిపడి ఉండేటట్లు కనిపిస్తోందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కంగు తిన్న మర్రి శశిధర్ రెడ్డి

సనత్ నగర్ సీటు ఆశించి తెరాసపై నాటి నుంచి పోరాటం చేస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత, మర్రిశశిధర్ రెడ్డి తొలి జాబితాలో సీటు దక్కకపోవడంతో కంగుతిన్నారు. ఓటర్ల జాబితాలో అవకవతకలకు సంబంధించి టీఆర్‌ఎస్‌పై ఒంటరి పోరాటంచేసిన తనకు  అధిష్టానం తొలి జాబితాలో చోటు కల్పించకపోవడంపై ఆయన అవమానంగా భావిస్తున్నారు. ఎప్పటినుంచో సనత్‌నగర్‌ సీటుపై గురిపెట్టిన తెదేపా ఆ పార్టీ నేత కూన వెంకటేశ్‌గౌడ్‌ కు అందించిన సమాచారంతో ఆయన ప్రచారంలో దూకుడు పెంచారు. ఇలాంటి పరిణామాలను గమనిస్తుంటే.. మహా కూటమిలో బాబు పాత్ర కీలకం కానున్నట్లు తెలంగాణ నేతలు అంచనా వేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news