బాబు రాజకీయంలో కోడెల ఆత్మ స్థానం!?

-

వైద్యునిగా జీవితాన్ని ప్రారంభించి ఎమ్మెల్యేగా, మంత్రిగా, స్పీకర్ గా ఉన్నతస్థానాలను అధిరోహించిన కోడెల శివప్రసాద్ ఆత్మహత్యకు కారణాలు ఏమిటి? ఈ ప్రశ్నకు వైకాపా నాయకులు ఒకలా, టీడీపీ నాయకులు మరోలా సమాధానాలు చెబుతారు! కానీ… నాటి పరిస్థితులను, నాడు కోడెలను దగ్గరనుంచి చూసిన వాళ్లలో అతికొద్ది మాత్రం ధైర్యంగా… ఆయన పడిన మానసిక క్షోభ మరియు ఆ సమయంలో ఏవైపు నుంచి రాని మద్దతు అని చెబుతారు!

అవును… కోడెల ఆత్మహత్యకు కొద్దిరోజుల ముందే.. ఆయన పుత్రరత్నం, పుత్రికా రత్నంలు చేసిన అరాచకాలన్నీ ఒక్కొక్కటే బైటకొచ్చాయి! పార్టీ ఘోర పరాభవం, వ్యక్తిగతంగా కోడెల దారుణ పరాజయం, అరాచకాలన్నీ ఒక్కొక్కటే బైటపడటం… ఇలా అన్నీ కలసి కోడెల ఆత్మహత్యకు కారణమయ్యాయే తప్ప.. వైసీపీ నేతలు కాదని ఒకానొక దశలో ప్రజలందరికీ తెలిసిన విషయంగా పెద్దలు చెబుతుంటారు. అయితే ఈ సమయంలో కోడెల వర్ధంతి సందర్భంగా… నాడు కోడెలపై పెట్టినవి అన్నీ తప్పుడు కేసులు అని చెబుతున్నారు చంద్రబాబు.

సరే… అవన్నీ తప్పుడు కేసులని చంద్రబాబే చెప్పుకుంటున్నారు కాబట్టి… మరి నిజం నిలకడ మీద తేలే వరకు కోడెల న్యాయపోరాటం చేయాల్సిందిగా బాబు కోరకపోయారా..? పోనీ కోడెలకు నాటికి ఆ మానసిక స్థైర్యం లేకపోతే.. చంద్రబాబైనా కోడెల తరపున వకాల్తా పుచ్చుకోవాల్సింది కదా! అవే కేసులు చంద్రబాబుపైకి వస్తే ఇలానే పత్రికా ప్రకటనలు ఇచ్చేసి ఊరుకుంటారా? అక్కడితో బాబు అన్యాయం ఆగిపోలేదు… అంత సీనియర్ అయినా కూడా కోడెల కోరిన నియోజకవర్గం బాబు ఇవ్వలేదు! అక్కడితో అయిపోయిందనుకుంటే పొరపాటే… కేసుల్లో ఇరుక్కున్నారని తెలిసిన తర్వాత సుమారు నెల రోజుల పాటు కోడెలకు కనీసం ఫోన్లో కూడా అపాయింట్ మెంట్ ఇవ్వకుండా చంద్రబాబు వేధించారని తెలుగు దేశం నేతలే చెబుతుంటారు! ఇది ఆయన్ని మానసికంగా క్షోభపెట్టడం కాదా?

ఇంతకాలం ఏపర్టీకోసం తాను పనిచేశానో… ఈ రోజు కష్టం వచ్చే సరికి అదే పార్టీ కనీసం ఫోన్ కూడా ఎత్తడం లేదంటే ఆ వయసులో, ఆ పరిస్థితుల్లో కలిగే మానసిక క్షోభ మాములుగా ఉంటుందా? అంటే… ఆత్మహత్యకు ఈమాత్రం పరోక్ష కారణం సరిపోదా? కానీ… ఇప్పుడు మాత్రం చంద్రబాబు కోడెలపై ఎక్కడలేని ప్రేమ చూపిస్తున్నారు! ఈ విషయాలు తెలిసిన బాబు సహకాలికులు మాత్రం… మనుషులు బతికున్నప్పుడు వేధించడం, చనిపోయాక వారి పేరు చెప్పుకుని రాజకీయం చేయడం బాబుకి వెన్నతో పెట్టిన విద్య్య అని… మొన్న ఎన్టీఆర్ కి జరిగినట్లుగానే, నిన్న కోడెల బతికుండగా కూడా అలాగే క్షోభపెట్టి చనిపోయాక ఇలా ప్రతి ఏటా జయంతి, వర్థంతుల సందర్భంగా వారి ఆత్మలకు ఆత్మశాంతి లేకుండా చేస్తుంటారాని అనడం కొసమెరుపు!

ఈ లెక్కన చూసుకుంటే… ఏడాదికి రెండు సార్లు (వర్ధంతి, జయంతి) కోడెల ఆత్మ.. బాబు రాజకీయంలో కీలక భూమిక పోషించబోతుందన్న కామెంట్లు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి!!

Read more RELATED
Recommended to you

Latest news