ఏపీ సర్కార్ కి హైకోర్ట్ షాక్..!

-

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్ట్ లో వరుస షాక్ లు తగులుతూనే ఉన్నాయి. తాజాగా ఏపీ సర్కార్ కి మరో షాక్ తగిలింది. అది ఏంటీ అంటే గ్రానైట్ క్వారీల విషయంలో ఏపీ సర్కార్ ఇటీవల కొందరు యజమానులకు భారీగా జరిమానాలు విధించింది. గుంటూరు జిల్లాలో గ్రానైట్‌ వ్యాపారులకు రూ. 2500 కోట్ల జరిమానా విధిస్తూ గనులు, భూగర్భ శాఖ గతంలో నోటీసులు ఇచ్చింది.

లాక్‌డౌన్‌తో గ్రానైట్‌ క్వారీలు మూతపడిన సమయంలో మళ్ళీ నోటీసులు ఇచ్చింది. ఓ క్వారీ యజమాని ఈ నోటీసుల మీద హైకోర్టును ఆశ్రయించారు. లాక్‌డౌన్‌ వల్ల మొత్తం పరిశ్రమ మూతపడిన నేపథ్యంలో నోటీసులు ఇవ్వడాన్ని ఆ పిటిషన్‌లో సదరు యజమాని సవాల్ చేసారు. దీనిపై కోర్ట్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేసింది. సదరు గ్రానైట్‌ క్వారీ తరఫున న్యాయవాది తన వాదనలు విన్న కోర్ట్…

దీనిపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇదే విషయంలో గతంలో ఒక తీర్పు ఇచ్చామన్నారు. పైగా ప్రస్తుతం లాక్‌డౌన్‌తో పరిశ్రమ మూసివేసి ఉందన్నారు. ఇప్పుడు జరిమానాలు విధించడం ఏంటి?’ అని ప్రశ్నించారని సమాచారం. ఈ నోటీసులకు ఇప్పటికిప్పుడే యజమానులు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని సదరు పిటీషనర్ కి చెప్పింది. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత విచారణ చేద్దామని చెప్పింది కోర్ట్.

Read more RELATED
Recommended to you

Latest news