భారత్, సౌతాఫ్రికాల నడుమ ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగాల్సిన తొలి వన్డే రద్దయింది. మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. మ్యాచ్ ఆరంభం అయ్యే సమయానికి వర్షం లేకపోయినా ముందుగా వర్షం కురవడంతో మైదానం తడిగా మారింది. దీంతో మైదానంలో చేరిన నీటిని సిబ్బంది తొలగించే పనిలో పడ్డారు. అయితే మ్యాచ్ ఆరంభం అయ్యే సమయం నుంచి వర్షం అప్పుడప్పుడూ పడుతూనే ఉంది. దీంతో కటాఫ్ సమయానికి మ్యాచ్ నిర్వహించే అవకాశం లేకపోయింది. ఈ క్రమంలో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.
కాగా సిరీస్‌లో 2వ వన్డే మ్యాచ్ ఈ నెల 15వ తేదీన లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి క్రికెట్ స్టేడియంలో జరగనుంది. అయితే కరోనా నేపథ్యంలో తదుపరి రెండు వన్డేలకు స్టేడియాలలో ప్రేక్షకులు కనిపించే అవకాశం లేదు. ఎందుకంటే గురువారం కేంద్ర ప్రభుత్వం ప్రజలకు కరోనా హెచ్చరికలు జారీ చేసింది. గుంపులు గుంపులుగా ఒక చోట ఉండవద్దని సూచించింది. ఈ క్రమంలో వచ్చే రెండు మ్యాచ్‌లకు స్టేడియాలలో జనాలు కనిపించే అవకాశం లేదని నిర్వాహకులు తెలియజేస్తున్నారు.