ట్రావెల్స్‌లో అక్రమాలకు పాల్పడ్డారంటూ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని, ఆయన తనయుడిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్.. కొందరు లారీ యజమానులతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. అయితే ఈ సందర్భంగా గోరంట్ల మాధవ్ మాట్లాడిన మాటలపై టీడీపీ అధినేత చంద్రబాబు విరుచుకుపడ్డారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన చంద్రబాబు.. “టీడీపీ నేతలపై ప్రభుత్వం పెడుతున్నవి అక్రమ కేసులు అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏంకావాలని చంద్రబాబు ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో లారీ యజమానులు మరో వ్యక్తిపై ఆరోపణలు చేస్తుంటే, గౌరవనీయ ఎంపీ స్థానంలో ఉన్న వ్యక్తి ప్రభాకర్ రెడ్డి పేరు చెప్పు అంటూ ఎగదోస్తున్నాడని టీడీపీ అధినేత చంద్రబాబు ఓ వీడియో పంచుకున్నారు. మీడియా సమక్షంలోనే పబ్లిగ్గా ఇంత కుట్ర చేసిన వాళ్లు, తెరవెనుక ఇంకెన్ని చేస్తున్నారో ప్రజలు ఆలోచించాలని ట్వీట్ చేశారు. ఇది కచ్చితంగా అధికార దుర్వినియోగమేనని, ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సొంత కక్షలకు వాడుకోవడం నేరమని మండిపడ్డారు.
తెలుగుదేశం నాయకులపై ప్రభుత్వం పెడుతున్నవి అక్రమ కేసులని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? ఇక్కడ లారీ యజమానులు చాలా స్పష్టంగా వేరే వ్యక్తి పేరు చెబుతుంటే, ఒక గౌరవనీయ ఎంపీ స్థానంలో ఉన్నాయన "ప్రభాకర్ రెడ్డి పేరు చెప్పు" అని ఎగదోస్తున్నారు. (1/2)#TDPWithJCFamily pic.twitter.com/G42OmCliGb
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) June 17, 2020