ఎవరెన్ని చెప్పినా సరే తెలుగుదేశం పార్టీకి తెలుగు యువత విభాగం అనేది చాలా కీలకంగా ఉంటుంది అనే సంగతి అందరికీ తెలిసిందే. తెలుగుదేశం పార్టీలో తెలుగు యువత దాదాపుగా పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా కీలకంగా వ్యవహరిస్తూ పార్టీలో ఎక్కువగా నిరసన కార్యక్రమాలు చేయడం రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పెట్టడం ప్రతిపక్షంలో ఉన్న సమయంలో సమర్ధవంతంగా వ్యవహరించి పార్టీ అధిష్టానానికి పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందించడం వంటివి చేస్తూ ఉంటుంది.
అయితే ఇప్పుడు మాత్రం పరిస్థితులు కాస్త భిన్నంగా కనపడుతున్నాయి. తెలుగు యువత పెద్దగా కష్టపడలేదు తిరుపతి పార్లమెంటు పరిధిలో. తెలుగు యువతకు కొంతమంది నాయకులు పనిచేయాల్సిన అవసరం ఉన్నా సరే పని చేయడం లేదు. రాష్ట్రంలో ఉన్న యువ నాయకులు అందరు కూడా అక్కడే ఉన్నా సరే తెలుగు యువతను ముందుకు నడిపించే విషయంలో ఆసక్తి చూపించకపోవడం చాలా వరకు కూడా రాజకీయంగా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు యువతని పూర్తిగా చంద్రబాబు నాయుడు నిర్వీర్యం చేశారనే ఆవేదన వ్యక్తం అవుతుంది. అందుకే యువకులు చాలా మంది తెలుగుదేశం పార్టీకి దూరం అయిపోయారు అనే భావన కూడా ఉంది. గతంలో మాదిరిగా పార్టీ కోసం పని చేయడానికి చాలామంది ముందుకు రాకపోవడం ఇప్పుడు పార్టీని కలవరానికి గురి చేస్తున్న అంశం. మరి ఈ విషయంలో పార్టీ అధిష్ఠానం చర్యలు చేపడుతుందా లేదా అనేది చూడాలి.