మొదటి దశలో ఈ రెండు ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణ.. షార్ట్ లిస్ట్ విడుదల చేసిన కేంద్రం..!

-

న్యూఢిల్లీ: దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులను (పీఎస్‌బీ) ప్రైవేటీకరించేందుకు కేంద్రం అడుగులు వేస్తోంది. మొదటి ప్రక్రియలో కనీసం రెండు పబ్లిక్ సెక్టార్ బ్యాంకులను ప్రైవేటీకరించేందుకు ఈ రోజు నిర్ణయం తీసుకోనుంది. ఈ మేరకు రిజర్వు బ్యాంక్ ఆప్ ఇండియా (ఆర్‌బీఐ), ఆర్థిక వ్యవహారాల శాఖ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బ్యాంకుల ప్రైవేటీకరణ, పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

india+banks+list
india+banks+list

ప్రైవేటీకరణ జాబితాలో ఉన్న బ్యాంకులు..
బిజినెస్ స్టాండర్డ్ నివేదిక ప్రకారం.. నీతి అయోగ్ 4 నుంచి 5 ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించేందుకు ప్రతిపాదించింది. అయితే మొదటి దశలో ఏదైనా రెండు బ్యాంకులను ప్రైవేటీకరించాలని కేంద్రం భావిస్తోంది. ప్రైవేటీకరణ జాబితాలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ పేర్లను ప్రతిపాదించారు. అయితే ప్రైవేటీకరణ మొదటి దశలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుల పేర్లు వినిపిస్తున్నారు. మంగళవారం బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్యాంకును బహుళ ఒప్పందాల కింద లక్షకుపైగా షేర్లను మార్చిన తర్వాత బీఎస్ఈ స్టాక్ ఎక్సేంజ్‌లో 15.6 శాతం షేర్లు పెరిగాయి. అయితే ఈ జాబితాలో ఇటీవల ఏకీకృతమైన బ్యాంకులు ప్రైవేటీకరించడం జరగదన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉండగా.. ఇందులో ఎస్‌బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి బ్యాంకులు ప్రైవేటీకరణ జాబితాలో లేవు.

ప్రైవేటీకరణకు బిల్లు ప్రతిపాదన..
బ్యాంకుల ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే బిల్లు ప్రతిపాదించనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రెండు బ్యాంకులకు ప్రైవేటీకరణ జరిగేలా సన్నాహాలు చేస్తున్నారు. వీటిలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ పేర్లు ఉన్నాయి. అయితే వీటిలో ఏ రెండు బ్యాంకులు మొదటి జాబితాలో ప్రైవేటీకరణ జరుగుతాయనే విషయంపై స్పష్టత రాలేదు. గత నెల ఫిబ్రవరిలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకుల ప్రైవేటీకరణకు బిల్లు సమర్పించగా.. ఇందులో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు, సాధారణ బీమా సంస్థలు ప్రైవేటీకరించాలని ప్రతిపాదించారు.

Read more RELATED
Recommended to you

Latest news