టీడీపీ నేతలకు చంద్రబాబు కీలక ఆదేశాలు

అమరావతి : టీడీపీ పార్టీ సీనియర్ నేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వర్చువల్ భేటీ నిర్వహించారు. ఈ సందర్ఢంగా కొత్త జిల్లాల ప్రక్రియను చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు తెలుగు దేశం పార్టీ నేతలు. అధికార వైసీపీ పార్టీ నేతల కనుసన్నల్లోనే జిల్లాల ప్రక్రియ కొనసాగుతుందని చంద్రబాబు నాయుడు దృష్టికి తెచ్చారు పార్టీ నేతలు.

chandrababu
chandrababu

క్యాసినో వ్యవహారం, ఉద్యోగుల సమస్యలను పక్కదారి పట్టించేందుకే కొత్త జిల్లాల ప్రక్రియ అని అభిప్రాయపడ్డారు నేతలు. ప్రభుత్వ ఉద్దేశం ఏదైనా టిడిపి మాత్రం స్థానిక ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించాలని నేతలకు ఈ సందర్భంగా సూచనలు చేశారు చంద్రబాబు నాయుడు. ఏపీ మంత్రి కొడాలి నానిపై చర్యలు తీసుకునే వరకు క్యాసినో వ్యవహారం లో పోరాటం చేయాలని నేతలకు చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. పార్టీకి ఏపీ పుర్వ వైభవం తెచ్చేందుకు అందరూ కలిసి కట్టుగా కృషి చేయాలని కోరారు చంద్రబాబు నాయుడు.