ఆ డేట్ చెబితే చంద్రబాబు కి నిద్ర కూడా పట్టట్లేదు !

-

చంద్రబాబు నాయుడు పొలిటికల్ కెరియర్ లో మర్చిపోలేని నెంబర్ ఏదైనా ఉంది అంటే అది 23. 2014 ఎన్నికలలో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు ఆ సమయంలో ప్రతిపక్షంలో ఉన్న వైసిపి పార్టీ నాయకులను 23 మంది ఎమ్మెల్యేలను అక్రమంగా అవినీతి సొమ్ముతో తన పార్టీలోకి చేర్చుకోవడం జరిగింది. ఆ తర్వాత జరిగిన 2019 ఎన్నికలలో సరిగ్గా 23 స్థానాలు మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలవ గలిగింది.Image result for sleepless chandrababuఅది కూడా మే 23 వ తారీఖున రిజల్ట్స్ రావడం జరిగింది. ఈ విషయాన్ని ఎన్నికల్లో గెలిచిన తర్వాత వైయస్ జగన్..దేవుడు ఇచ్చే తీర్పు ఎలా ఉంటుందని..ఎవడు తీసిన గోతిలో వాడే పడతాడు అన్న రీతిలో చంద్రబాబు పై సెటైర్లు వేశారు. ఇదిలా ఉండగా సార్వత్రిక ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా వస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఈ నెలలోనే జరుగుతున్నాయి.

 

ఇప్పటికే ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. ఇదంతా పక్కన పెడితే ఈనెల నిర్వహిస్తున్న స్థానిక ఎన్నికల్లో మునిసిపాలిటిలకు పోలింగ్ తేదీ 23 కావడంతో ఇప్పుడు టిడిపి ని ఆ తేదీ సెంటిమెంట్ వెంటాడుతుంది. మళ్లీ అటువంటి తీర్పు వస్తే ఇంకా తెలుగుదేశం పార్టీ తెలుగు రాజకీయాల్లో కనుమరుగవడం గ్యారెంటీ అనే టాక్ నడుస్తోంది. దీంతో మళ్లీ 23 వ తారీకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో చంద్రబాబుకి నిద్ర పట్టడం లేదు అన్న వార్తలు ఏపీ రాజకీయాల్లో వినబడుతున్నాయి. 

 

Read more RELATED
Recommended to you

Latest news