సుదీర్ఘ గ్యాప్ తరువాత చంద్రబాబు కుప్పం పర్యటనకు వెళుతున్నారు. ఆయన పర్యటనలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోనున్నాయి అనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొన్న పంచాయతీ ఎన్నికలలో ఘోర ఫలితాల అనంతరం ఇప్పుడు చంద్రబాబు మూడు రోజుల పర్యటనకు కుప్పం బయలు దేరి వెళుతున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో ముఖ్యమైన నేతలు కొంతమంది రాజీనామా చేస్తారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. మరో పక్క కొంతమంది వైసీపీ నేతలు అయితే బాబు పర్యటనను అడ్డుకుంటామని వార్నింగ్ ఇస్తున్నారు.
నిజానికి 1989 నుంచి మొన్న 2019 ఎన్నికల వరకు చంద్రబాబు కుప్పం ప్రజలు అండగా నిలిచారు.. కనీసం ఆయన నామినేషన్ కూడా వేయడానికి వెళ్లే వారు కాదు. కానీ అలాంటిది మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికలలో టీడీపీ ఘోర పరాజయం పాలైంది. మొత్తం కుప్పం నియోజకవర్గం పరిధిలో 89 గ్రామపంచాయతీలు ఉంటే అందులో కేవలం 14 చోట్ల మాత్రమే టిడిపి మద్దతుదారులు గెలిచారు. మిగతా అన్ని చోట్లా వైసీపీ మద్దతుదారులు గెలిచారు. ఈ అంశమే చర్చనీయాంశంగా మారింది. మరి ఈ రోజు చంద్రబాబు కుప్పం పర్యటనలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోనున్నాయి అనేది చర్చనీయాంశంగా మారింది.