మస్ట్ రీడ్: జగన్ కరోనా ఫైట్ సూపర్.. సాక్ష్యం చూపించిన బాబు!  

-

చంద్రబాబు తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో తెలియదు కానీ… వ్యూహాలు వ్యూహాలు వేసి మరీ జగన్ కు సపోర్ట్ చేస్తున్నారు. జగన్ కు ప్లస్ అయ్యే పనులు ప్లాన్ చేసి మరీ చేస్తున్నారు! ప్రస్తుతం తమ్ముళ్లు ఈ విషయాలతో ఆవేదన చెందుతున్నారు. తాజాగా… కరోనా పై పోరు అంటూ ఒక వెబ్ సైట్ ప్రారంభించిన బాబు… జగన్ కరోనా విషయంలో ఎంత బాగా ఫైట్ చేస్తున్నారో చెప్పకనే చెప్పారు! ఫలితంగా శభాష్ జగన్ అనిపించారు!

అవును… అంతా అయిపోయాక ఇప్పుడు మొదలుపెట్టిన చంద్రబాబు.. కరోనా విషయంలో ఏపీ ప్రజలు తెగ ఇబ్బందులు పడుతున్నారని, వారికి ఎలాంటి కష్టం వచ్చినా తన వెబ్ సైట్ లో నమోదు చేసుకోవాలి, వారికి పార్టీ అండగా ఉంటుందని చెప్పుకొచ్చారు! దీంతో.. ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంక్సం అయినా తమ్ముళ్లంతా తెగ కంప్లైట్ లు పోస్ట్ చేసేస్తారని అంతా భావించారు! కానీ… కరోనా సమయంలో జగన్ అమలుపరుస్తున్న సంక్షేమ కార్యక్రమాల ఫలితం వల్ల.. చంద్రబాబు వెబ్ సైట్ కి స్పందన కరువైంది!

“ఏపీలో కరోనా కేసులు 7 లక్షలు దాటిపోయాయి. 6 వేలమంది మరణించారు. అయితే కరోనాను నియంత్రించే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేకపోవడం దురదృష్టకరం. ఇక మరోపక్క లాక్ డౌన్ కారణంగా అనేకమంది జీవనోపాధి కోల్పోయి తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. రైతుల పరిస్థితి మరీ ఘోరం. ఏపిలో పేద కుటుంబాలు రోజువారీ ఆహారధాన్యాలకు కూడా కటకట లాడుతున్నాయి.  ఈ విపత్కర పరిస్థితుల్లో బాధ్యతాయుత రాజకీయ పార్టీగా రాష్ట్ర ప్రజల ఇబ్బందుల పరిష్కారానికి తెలుగుదేశం పార్టీ ఒక ఓపెన్ ఫోరం ను ఏర్పాటు చేసింది.” అంటూ ఒక వెబ్ సైట్ ను 4.7 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు బాబు!

అయితే.. 3వ తేదీన స్టార్ట్ చేసిన ఈ ఫారంలో 5వ తేదీనాటికి వచ్చిన మొత్తం ఫిర్యాదుల సంఖ్య – 832! వాటిలో ఉద్యోగాలు పోయినాయి అని 329, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయని 196, పంట నష్టపోయామని 43, ప్రభుత్వ పరిహారం అందలేదని 37, నిత్యావసరాల కొరత ఉందని 22, ఇతర సమస్యలు ఉన్నాయని 164 ఫిర్యాదులు నమోదయ్యాయి! కోట్ల మంది ప్రజానికం ఉన్న రాష్ట్రంలో, ఈ కరోనా సమయంలో ఇంత తక్కువగా ఫిర్యాదులు వచ్చాయంటే జగన్ పాలన్ శభాస్ అనే అనుకోవాలనేది విశ్లేషకుల మాట!

65లక్షలకు పైగా సభ్యత్వాలున్న పార్టీకి సంబంధించిన అధినేత ఈ విధంగా పిలుపునిచ్చినా కూడా ఇంత తక్కువగా ఫిర్యాదులు వచ్చాయంటే అది కచ్చితంగా జగన్ పాలన గొప్పతనమే కామెంట్లు ఆన్ లైన్ వేదికగా బలంగా వినిపిస్తున్నాయి. ఫలితంగా ఇక కరోనా విషయంలో జగన్ పాలన బాగాలేదని టీడీపీ నేతలు మాట్లాడకపోవచ్చని అంటున్నారు నెటిజన్లు. అలాగే… జగన్ పాలనపై తనదైన 99శాతం మార్కులతో బెస్ట్ రిజల్ట్ ఇచ్చిన బాబు & కో కు వైకాపా కార్యకర్తలు ధన్యవాదాలు చెబుతున్నారు!

-CH Raja

Read more RELATED
Recommended to you

Latest news