తాను చేస్తే సంసారం అన్నాట్ట వెనకటికి ఒక పెద్ద మనిషి! ప్రస్తుతం టీడీపీ నేతలు ఇలాంటి కబుర్లే చెబుతున్నారు! తాముచేసిన నిస్సుగ్గు పనులను అందంగా కప్పిపుచ్చుకుంటూ.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన బాబు & కోలు ఇప్పుడు అల్లాల్లాడిపోతున్నారంట.. కుడితిలో పడ్డ ఎలుకల్లాగా విలవిల్లాడిపోతున్నారంట! ఇంతకూ అందుకు కారణమైన సంఘటనలు ఏమిటో ఇప్పుడు చూద్దాం!
తాను అధికారంలో ఉండగా అవసరం లేకున్నా.. ఎవరైనా చూసి నవ్వుతారని లేకుండా… ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తూ.. తమ ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి తమ పార్టీలోకి వస్తున్నారంటూ… ఫ్యాన్ గుర్తుపై గెలిచిన 23మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. వారిలో ముగ్గురికి మంత్రిపదవులు కూడా ఇచ్చారు! ఇచ్చినవారీకీ లేదు.. తీసుకున్నవారికీ లేదు!!
అయితే… ఇప్పుడు టీడీపీ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు వైకాపాలోకి వెళ్లిపోయారని మైకుల ముందుకొచ్చి ప్రజాస్వామ్యం గురించి ఊకదంపుడు ఉపన్యాశాలు ఇస్తున్నారు టీడీపీ నేతలు! ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలు వైకాపాలో చేరారని శాపనార్థాలు పెడుతున్నారు! ఇక్కడ టీడీపీ నేతలు గ్రహించాల్సింది ఒకటుంది!
వల్లభనేని వంశీ, మద్దాల గిరి, కరణం బలరాం, వాసుపల్లి గణేష్ కుమార్, గంటా శ్రీనివాస్!! లు సైకిల్ అయితే దిగారు కానీ అధికారికంగా వైకాపా నేతలు కాలేదు అన్న విషయం టీడీపీ నేతలు గ్రహించాలి. చంద్రాబాబు అంతలా జగన్ బరితెగించి కండువాలతో ఎదురెళ్లి పదవులు కట్టబెట్టి రాక్షసానందం పొందడం లేదు! సపోజ్ ఫర్ సపోజ్… వాళ్లంతా అధికారికంగా వైకాపాలోనే చేరారు అనుకుంటే… రొటీన్ డైలాగ్ ఎలాగూ ఒకటుందిగా… “వైకాపా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి.. వారి వారి నియోజకవర్గాల అభివృద్ధి కోసం పార్టీలో చేరుతున్నారు” అని!
అయితే ఈ విషయాలపై టీడీపీపై మరింత కారం చల్లేలా మాట్లాడిన విజయసాయిరెడ్డి… “రాష్ట్రంలో పాలన చూసి చాలా మంది శాసనసభ్యులు పార్టీలోకి రావడానికి సుముఖంగా ఉన్నారు. కొన్ని ప్రతిపాదనలు ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిశీలనలో ఉన్నాయి. సరైన సమయంలో జగన్ సరైన నిర్ణయం తీసుకుంటారు. పార్టీలో చేరాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి” అని క్లారిటీ ఇచ్చారు!!
-CH Raja