జగన్ ప్రభుత్వంపై ఈ ఏడు మాసాల కాలంలో పైచేయి సాధించింది ఇది ఒక్కటే అంటూ .. టీడీపీ అధినేత చంద్రబాబు అండ్ కో తెగ సంబరాలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ విజయం వెనుక టెక్నికాలిటీ పక్కన పెడితే.. మొత్తానికి జగన్ దూకుడుకు మాత్రం ఒకింత బ్రేక్ పడింది. అయితే, ఇది ఎక్కువ సమయం నిలిచే బ్రేక్ కాదు.. ఎంత తొక్కిపెడదామన్నా.. మూడు మాసాలకు మించి ఉండదు. సో.. ఈ నేపథ్యంలో శాశ్వతంగా జగన్ దూకుడు బ్రేకులేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. అంటే.. మండలిని రద్దు చేస్తానని, మండలి అవసరమా? అని జగన్ కామెంట్లు చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో సోమవారం ఆయన అసెంబ్లీలో ఈ విషయంపై చర్చించి తీర్మానం చేసి, కేంద్రానికి పం పేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ క్రమంలో అక్కడ కనుక కేంద్రం ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టి ఆమోదిస్తే.. ఇక, మండలికి తెరపడుతుంది. దీంతో వైసీపీ పరిస్థితి ఎలా ఉన్నా.. టీడీపీకి అంతో ఇం తో బలం , గళం ఉన్న మండలి సభ్యులు డమ్మీలవుతారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు.. కేంద్రం వద్ద అప్పుడే లాబీయింగ్ చేసేందుకు వ్యూహం సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది.
బీజేపీలోని తన మిత్రులు కొందరితో ఈ విషయం ఇప్పటికే కదిలించారని సమాచారం. టీడీపీ నుంచి బీజేపీ తీర్థం పుచ్చుకున్న సుజనా చౌదరి, సీఎం రమేష్ వంటి వారు ఇప్పటికీ బాబుకు టచ్ లోనే ఉన్నారు. పైకి మాత్రం స్వల్పంగా విమర్శించుకుంటున్నట్టు కనిపిస్తున్నా.. లోలోన మాత్రం ఒకరికొ కరు సాయం చేసుకునేందుకు సిద్ధంగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు సుజనాను చంద్రబాబు వాడు కునేందుకు రెడీఅ య్యారని, ఏపీలోని పరిస్థితులను కేంద్రంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా(టీడీపీకి అనుకూలమైన బీజేపీ నాయకుడు)కు చెప్పి.. కేంద్రానికి కనుక బిల్లు వస్తే.. ఖచ్చితంగా పెండింగ్‌లో పడేలా చేయాలని బాబు హైదరాబాద్‌లో మంతనాలు జరిపినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఈ విషయంలో బీజేపీకి కూడా లాభం ఉందని బాబు గుర్తు చేసినట్టు తెలిసింది. మరి ఈ ప్రక్రియను సుజనా ఒక్కరే నిర్వహిస్తారా? లేక ఎవరి సాయం ఏదైనా తీసుకుంటారా? అనేది చూడాలి. అయితే, కొసమెరుపు ఏంటేంటే.. జగన్ ప్రభుత్వం ఇంకా మండలి రద్దుపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. అయినా.. బాబు మాత్రం తొందరపడుతుండడం..!