గ్యాస్ లీక్ ఘటనపై స్పందించిన చంద్రబాబు

-

విశాఖ సమీపంలో గల అచ్యుతాపురం సెజ్ బ్రాండిక్స్ కంపెనీ నుంచి అమ్మోనియా గ్యాస్ లీకయిన సంగతి తెలిసిందే. 200 మంది అస్వస్ధతకు గురయ్యారు. ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. విశాఖలో విషవాయువు లీక్ అయిన ఘటన ఆందోళన కలిగించిందన్నారు. గతంలో జరిగిన ఎల్జీ పాలిమర్స్ ఘటన తరువాత కూడా పరిశ్రమల యాజమాన్యాలు, ప్రభుత్వాలు పాఠాలు నేర్చుకోకపోవటం విచారకరమని చంద్రబాబు అన్నారు.

Andhra Pradesh: New districts were formed for political gains, alleges  Chandrababu Naidu

అచ్యుతాపురం ఘటనలో ప్రభుత్వం బాధితులను ఆదుకోవడమే కాకుండా నిర్లక్ష్యానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ శాఖల పర్యవేక్షణ లోపం, వ్యవస్థల నిర్వీర్యం ప్రజల పాలిట శాపాలుగా మారుతున్నాయని చంద్రబాబు కామెంట్ చేశారు. అచ్యుతాపురంలో అమ్మోనియా గ్యాస్‌ లీక్ ఘటనపై సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీశారు. ఘటనపై అధికారుల నుంచి వివరాలు కోరారు. ఘటనకు దారి తీసిన కారణాలను సీఎంఓ అధికారులు వివరించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news