దీపావళీ జరుపుకోకుండా ఎన్నికలు పెడుతున్నారు : జగన్ పై చంద్రబాబు ఫైర్

ఏపీలో ఇటీవల విడుదల స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ పై టీడీపీ అధినేత చంద్రబాబు అంసతృప్తి వ్యక్తం చేశారు. ఇంత హజావుడిగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాల్సిన అవసరం ఏముంది..? అని… దీపావళీ పండుగ కూడా జరుపుకోనివ్వకుండా ఎన్నికల ప్రక్రియను ప్రారంభించారని ఫైర్‌ అయ్యారు. దీపావళీ పండుగ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తే ఏంటీ నష్టం..? అని నిలదీశారు. పండుగ జరుపుకోకుండా నామినేషన్లు వేసుకోవాల్సిన పరిస్థితి తెచ్చారని… ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు దారుణంగా జరిగాయని ఫైర్‌ అయ్యారు.

chandrababu naidu ys jagan

నామినేషన్లు మొదలుకుని కౌంటింగ్ వరకు అడ్డగోలుగా వ్యవహరించింది అధికార పార్టీ అని ఆగ్రహించారు. నామినేషన్ పత్రాలను స్కానింగ్ చేసుకోవాలి.. ఆ స్కానింగ్ పత్రాలను ఆర్వోలను మెయిల్ చేయాలన్నారు. నామినేషన్ల విషయంలో ఆర్వోలు పద్దతిగా వ్యవహరించాలని… ఆర్వోలు డ్రామాలు ఆడితే వదిలి పెట్టం.. వెంటాడతామని హెచ్చరించారు.

కొంత మంది ఆర్వోలు నామినేషన్లను చెల్లకుండా చేసేందుకు కొన్ని డాక్యుమెంట్లను చించేసిన సంఘటనలు జరిగాయన్నారు. అభ్యర్ధులు నామినేషన్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని దాఖలు చేయాలని తెలిపారు. నామినేషన్ల దాఖలుకు ముందు.. తర్వాత సోషల్ మీడియాలో నామినేషన్ పత్రాలను పెట్టాలని… దొంగ ఓట్లను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు చంద్రబాబు.