కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు జగన్ గురించి కీలక కామెంట్స్ చేశారు. జగన్ విపరీతంగా అప్పులు చేస్తున్నాడు…దిగిపోయే లోపు ఐదారు లక్షల కోట్లు అప్పులు చేస్తాడని అన్నారు. ఈ అప్పులన్నీ ప్రజలు తీర్చాల్సిందే…జగన్ తీర్చడని అన్నారు. రంజాన్ తోఫా, చంద్రన్న బీమా, క్రిస్మస్ కనుక, అన్నా క్యాంటీన్ ఉన్నాయా….మాటలు తప్ప ఏమీ లేవని అయన అన్నారు. సీఎం ఆస్తులు , ఆదాయం పెరిగిపోతుంది…ప్రజల ఆదాయం తగ్గుతుందని, సీఎం పొట్ట బాగా నిండింది…ఎప్పుడు పగులుతుందో తెలీదని ఆయన అన్నారు. ప్రత్యేకహోదా సంజీవని అని…అది వస్తే ఉద్యోగాలు వస్తాయి…25 ఎంపీ లను ఇమ్మన్నాడని, మెడలు వంచుతా అన్నాడు.
..ఇపుడు మెడలు దించాడని అన్నారు. విశాఖ ఉక్కు…ఆంధ్రుల హక్కు కూడా పోయిందని, ఏపీలో అన్ని అరాచకాలేనని అన్నారు. ప్రజలే నాయకత్వం వహించాలి….ప్రజలే బుద్ధి చెప్పాలని బాబు అన్నారు. ఏకపక్షంగా ఎన్నికలు జరుగుతున్నాయని, ఫోర్జరీ సంతకాలతో విత్ డ్రా చేశారని అన్నారు. అలాగే ఏమి పీకారు అని వైసీపీకి ఓటేయాలని బాబు ప్రశ్నించారు. బలవంతపు ఏకగ్రీవాలు దుర్మార్గం అని, పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ బలపరచిన సర్పంచులు 50 శాతం గెలిచేవారమని మిడ్ నైట్ డ్రామా ఆడి తాము గెలిచినట్టు చెప్పుకుంటున్నారని అన్నారు.