బ్రేకింగ్ : విజయవాడ మేయర్ అభ్యర్థిగా కేశినేని శ్వేత..

అనేక చర్చల అనంతరం విజయవాడ మేయర్ అభ్యర్థిని పార్టీ అధికారికంగా ప్రకటించింది. ముందు నుండి ప్రచారం జరుగుతున్నట్టుగా మేయర్ అభ్యర్థిగా కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత ఎంపికయ్యారు. నిజానికి ఈ అంశం మీద చాలా రోజుల నుండి విజయవాడ టీడీపీలో అనేక రకాల వివాదాలు జరుగుతున్నాయి.

ఆమెను మేయర్ అబ్యర్దిహ్గా ప్రకటించాలని నాని వర్గం, అలా ఎలా ప్రకటిస్తారు అని నాని వ్యతిరేక వర్గం బాహాటంగానే గొడవకు దిగారు. అయితే ఎట్టకేలకు దీనికి సంబంధించి ఏపీ అధ్యక్షుడు అచ్చేన్నాయుడు అధికారిక ప్రకటన విడుదల చేశారు.

నిజానికి విజ‌య‌వాడ మేయ‌ర్ అభ్య‌ర్థిత్వంపై టీడీపీలో చాలా రోజుల నుంచే రాజ‌కీయ సెగ‌లు మొద‌ల‌య్యాయి. మేయ‌ర్ అభ్య‌ర్థిత్వం త‌మ‌కే ఖ‌రారైన‌ట్లుగా నాని వ‌ర్గం…ఇదేంట‌ని నిల‌దీస్తూ మ‌రో వ‌ర్గం విజ‌య‌వాడ‌లో రాజ‌కీయ ర‌చ్చ‌కు తెర‌లేపుతున్నాయి. విజయవాడ కార్పొరేషన్ టీడీపీ మేయర్ అభ్యర్థిగా కేశినేని నాని కుమార్తె శ్వేత‌కే ఖాయ‌మైన‌ట్లుగా నాని వ‌ర్గీయులు చాలా రోజుల ప్ర‌చారం చేసుకుంటున్నారు. అయితే ఆయన వ్యతిరేక వర్గం దానిని రచ్చ చేసినా సరే ఆమెకే అవకాశం ఇవ్వడం గమనార్హం.