గద్దర్‌ ఎన్నో ప్రజాపోరాటాలకు నాంది పలికారు : చంద్రబాబు

-

ఇటివలే కన్నుమూసిన గద్దర్‌ను భయం అంటే ఏంటో తెలియని వ్యక్తిగా టీడీపీ అధినేత చంద్రబాబు అభివర్ణించారు. మంగళవారం గద్దర్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను చంద్రబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1997లో గద్దర్‌పై కాల్పులు జరిగిన ఘటనపై స్పందించారు. కాల్పుల ఘటనకు సంబంధించి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

Chandrababu: 'Extraordinary situation': Chandrababu seeks President, PM's  intervention in..

తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యాన్ని‘మా భూమి’పేరుతో సినిమా తీశారు నిర్మాత నర్సింగరావు. ఆ సినిమాలో ఉద్యమకారుడి పాత్రలో గద్దర్ నటించారు. చిత్రంలోని‘బండెనకబండి కట్టి పదహారెడ్ల బండి కట్టి ఏ బండ్లె వస్తవ్ కొడకా నైజాము సర్కరోడా’అనే పాట పాపులర్ అయ్యంది. ఆ సినిమా పాటను చూసే గద్దర్ తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నట్టు భావించి ఉంటారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా దాదాపు పదేళ్లపాటు ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా వ్యవహరించిన చంద్రబాబుకు తెలంగాణ సాయుధ పోరాటంపై అవగాహన లేకపోవడం గమనార్హం.

 

 

Read more RELATED
Recommended to you

Latest news