అయ్యన్న అరెస్ట్..పార్టీ నేతలకు చంద్రబాబు కీలక ఆదేశాలు

-

టీడీపీ సీనియర్‌ నేత అయ్యన్న పాత్రుడిని పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ సంఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. టీడీపీ సీనియర్‌ నేత అయ్యన్న పాత్రుడి అరెస్ట్‌ కు వ్యతిరేకంగా.. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ పార్టీ నిరసనలు తెలపాలని పిలుపునిచ్చారు చంద్రబాబు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఒక సిఎం లా కాకుండా రాక్షసుడిలా వ్యవహరిస్తున్నాడు.

గోడలు దూకి, తలుపులు పగల గొట్టి నర్సీపట్నంలో మాజీ మంత్రి, బిసి నేత అయ్యన్న పాత్రుడి ని అరెస్టు చెయ్యడం దిగ్ర్బాంతి కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు.అధికారంలో వచ్చిన నాటినుంచి అయ్యన్న కుటుంబాన్ని ప్రభుత్వం వెంటాడుతోంది…ఇప్పటికే 10కిపైగా కేసులు పెట్టారు. చింతకాయల విజయ్ పై కేసు విషయంలో సిఐడి విధానాలను కోర్టు తప్పు పట్టినా పోలీసులు మారలేదు.దొంగల్లా పోలీసులు ఇళ్లమీద పడి అరెస్టులు చేసిన పరిస్థితులు రాష్ట్రంలో ఎప్పుడైనా ఉన్నాయా? వైసిపి సాగిస్తున్న ఉత్తరాంధ్ర దోపిడీ పై ప్రశ్నిస్తున్న బిసి నేతల గళాన్ని అణిచివేసేందుకే అయ్యన్న అరెస్టు. ప్రభుత్వ దోపిడీపై అయ్యన్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే అరెస్టులు అని మండిపడ్డారు చంద్రబాబు.

 

Read more RELATED
Recommended to you

Latest news