మొయినాబాద్‌ ఎమ్మెల్యే కొనుగోలు సినిమా ఇంకా ఉంది.. నడ్డా, షా అందుకే రాలేదు : మంత్రి కేటీఆర్‌

-

మొయినాబాద్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఈ వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి కేటీఆర్. ఈ వ్యవహారానికి సంబంధించి త్వరలోనే పాన్ ఇండియా సినిమా చూపిస్తామని, అందులో విస్ఫోటక సమాచారంతోపాటు దిగ్భ్రాంతి కలిగించే అంశాలు ఉంటాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నికకు ముందే తమ ఎమ్మెల్యేలు నలుగురిని చేర్చుకోవడం ద్వారా టీఆర్ఎస్‌ను నైతికంగా దెబ్బకొట్టాలన్న బీజేపీ పన్నాగాన్ని తిప్పికొట్టినట్టు చెప్పారు మంత్రి కేటీఆర్. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో మునుగోడులో సభ నిర్వహించి ఆ నలుగురినీ పార్టీలో చేర్చుకోవాలనుకున్నారని, కానీ బెడిసికొట్టడంతో సభను రద్దు చేసుకున్నారని అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక ఫలితం బీఆర్ఎస్‌కు పునాది అవుతుందని కేటీఆర్ అన్నారు.

KTR keeps land regularisation promise

సరైన నాయకత్వం, పోరాట పటిమ లేని కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉండడం బీజేపీ అదృష్టమని మంత్రి పేర్కొన్నారు. తమ ఎమ్మెల్యేలకు ఎరకు సంబంధించి త్వరలోనే మొత్తం సినిమా బయటకు వస్తుందని అన్నారు. మునుగోడులో ఓటమి ఖాయమనే నడ్డా, అమిత్ షా ప్రచారానికి రాలేదని అన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు మఠాధిపతులను వినియోగించుకోవడం ద్వారా హిందూ మతానికి బీజేపీ చెడ్డపేరు తెస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్. మునుగోడులో రాజగోపాల్‌రెడ్డిపై తీవ్ర వ్యతిరేకత ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news