వైసీపీ నేతలు కొత్త బిచ్చగాళ్లు…వాళ్లకు చరిత్రే లేదని చంద్రబాబు ఫైర్ అయ్యారు. పొత్తులు రాష్ట్ర పరిస్థితుల బట్టీ ఏర్పాడుతుంటాయని… పోత్తులు లేకుండా గెలిచాము…పోత్తులతో గెలిచామని గుర్తు చేశారు. పోత్తులతో ఓడిపోయినా సందర్భం ఉందని… రాష్ట పరిస్థితి దృష్యా అందరూ కలవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఒక్క ఛాన్స్ అడిగారు ఇచ్చారు… రాష్ట్రాన్ని నాశనం చేశారు… ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సంక్షేమం పనులు చేశామన్నారు..
వైకాపా నేతలకు ప్రజలు త్వరలో చెవులు పూలు పెట్టే రోజులు వస్తాయి…జగన్ ఒక విధ్వంసకారీ అని ఫైర్ అయ్యారు. తమిళనాడులో అమ్మ క్యాంటిన్ ఉంది… అన్న క్యాంటిన్ ఎందుకు తీసేశారని మండిపడ్డారు. ప్రజల్లో వైకాపాపై తీవ్ర వ్యతిరేకత ఉందని… రాష్ట్రం జగన్ జాగీరు కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు…కోవిడ్ వల్ల ఎపి ఆదాయం తగ్గలేదు… జగన్ పరిపాలనా చేయకపోవడం వల్ల ఆదాయం తగ్గింది…జగన్ తీరుతో వైకాపా శ్రేణులు బాదితులుగా ఉన్నారన్నారు… పుంగనూరు ఎలా పెద్దిరెడ్డి గెలుస్తాడు చూస్తాను..కుప్పంతో ఎప్పుడూ ఎమోషన్ ఎటాచ్ మెంట్ ఉంటుందని పేర్కొన్నారు.