పాల్వంచలో రామక్రిష్ణ కుటుంబం ఆత్మహత్యలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు కుమారుడు వనమా రాఘవేంద్ర పై ప్రతిపక్షాలు, సాధారణ ప్రజానీకం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అతన్ని ఉరి తీయాలంటూ.. ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఈరోజు పాల్వంచ, కొత్తగూడెం బంద్ కు ప్రతిపక్షాలు పిలుపునిచ్చాయి.
తాజాగా వనమా రాఘవేంద్ర దుర్మార్గాలపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ కూడా ఫైర్ అయింది. ట్విట్టర్ వేదికగా తీవ్ర ఆగ్రహన్ని వ్యక్తం చేసింది. ’’టీఆర్ఎస్ లీడర్ అరాచకాలకు నిండు కుటుంబం బలైంది. ఎన్నో కలలు గన్న తల్లిదండ్రులు లోకాన్ని విడిచారు. బంగారు భవిష్యత్తు ఉన్న పసి పిల్లలు అగ్నికి ఆహుతయ్యారు. ఇలాంటి దుర్మార్గున్ని వదిలిపెట్టకూడదు. తన తండ్రి ఎమ్మెల్యే వనమా ప్రోద్బలంతోనే ఇలాంటి దారుణాలకు ఒడిగట్టాడు. గతంలోనూ వనమా రాఘవ ఆగడాలకు వడ్డీ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి భూకబ్జాలు, సెటిల్ మెంట్లతో ఎన్నో కుటుంబాలు బలయ్యాయి. ఇలాంటి నీచుడికి వెంటనే ఉరి శిక్ష వేయాలి.ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తన పదవికి రాజీనామా చేసి,రాజకీయాల నుంచి తప్పుకోవాలి అని డిమాండ్ చేసింది.