నమ్మండి… బాబు “షో” చేయలేదంట!

-

తాను షో చేయలేదు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినా పబ్లిసిటీ పిచ్చి మాకు నాడు లేదు.. నేడు ప్రచారం కోసం కోట్లు ఖర్చు పెడుతున్నారు.. 104, 108 అంబులెన్సుల ప్రారంభోత్సవం కోసం కోట్లు ఖర్చుపెట్టి ప్రచారాలు చేయించారు. తాము ఇంతకంటే ఎక్కువ అంబులెన్సులే పెట్టాం… కాని మీలాగా షో చేయలేదు! ఈ రేంజ్ లో మాట్లాడింది మరెవరో కాదు… సాక్ష్యాత్తు ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు!

chandrababu slams ys jagan mohan reddy
 

ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 104, 108 అంబులెన్సులు టీడీపీని బాగా డిస్ట్రబ్ చేశాయని కథనాలు వస్తున్న తరుణంలో… బాబు కూడా అలానే స్పందించారు! అసలు ప్రచారాలు చేసుకోవడమోలో బాబుని మించిన దిట్టలేరని చెబుతుంటారు రాజకీయ విశ్లేషకులు! ఆ సమయంలో ప్రజల ప్రాణాలు సైతం ఆయనకు పట్టవని వర్ణిస్తుంటారు. ఈ క్రమంలో ప్రచార యావ అనే ప్రస్థావన రాగానే పుష్కరాల సమయంలో బాబు షూటింగుల పేరు చెప్పి చేసిన షో అంతా ఇంతా కాదు అనేది అందరికీ తెలిసిన విషయమే!

తాను అధికారంలో ఉండగా… ప్రతీ చోటా పసులు రంగు, ఆ రంగుపై బాబు ఫోటోలు తప్పనిసరి! ఆఖరికి కాల్వగట్లుపక్కనున్న కొబ్బరి చెట్లను కూడా పసుపురంగుతో నింపేసిన చంద్రబాబు… నేడు జగన్ పబ్లిసిటీకోసం కోట్లు ఖర్చుపెడుతున్నారని, షో చేస్తున్నారని అనడం హాస్యాస్పదమే కాదు.. గతాన్ని జనాలకు ఒకసారి గుర్తుచేయడంలోకి కూడా వస్తుందని అంటున్నారు విశ్లేషకులు! ఏది ఏమైనా… బాబు ఎప్పుడూ షో చేయలేదు కేవలం పనిమాత్రమే చేసుకుని వెళ్లారంట.. అని చెబుతున్న మాటలను ఎలా అర్థం చేసుకుంటారనేది ఏపీ ప్రజలకే వదిలేద్దాం అంటున్నారు విశ్లేషకులు!

Read more RELATED
Recommended to you

Latest news