భారత్ లో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. ప్రజలకూ, ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఏరోజుకారోజు నమోదవుతున్న కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. ఈ మహమ్మారి దెబ్బకు ఇప్పటికే ఎంతో మంది మరణించారు. అయినా ఇది మాత్రం తగ్గుముఖం పట్టట్లేదు. పరీక్షలు పెంచే కొద్ది కేసులు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. కాగా, గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కొత్తగా 20,903 కరోనా కేసులు నమోదయ్యాయి.
అలాగే కరోనా కారణంగా 379 మంది మరణించారు. దీంతో ఇండియాలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,25,544కి చేరుకోగా మొత్తం మరణాల సంఖ్య 18,213గా ఉంది. ఇప్పటి వరకు మొత్తం నమోదైన పాజిటివ్ కేసుల్లో 2,27,439 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా 3,79,891 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.