ఆధార్ కార్డు పై డిటైల్స్ మార్చాలా?.. ఈ సింపుల్ టిప్స్ మీకోసమే..

-

ఆధార్ కార్డు తప్పనిసరి.. అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఇది కూడా ఒకటి..ఏదైనా తప్పులు ఉంటే మాత్రం మొదటికే మోసం వస్తుంది..అందుకే ఆధార్ ను అప్డేట్ చేస్తున్నారు..ఇలాంటి తప్పుల్లో పేరు తప్పుగా ఉండటం ఓ సమస్య. పేరులో అక్షరాలు మిస్ కావడం, అదనంగా అక్షరాలు రావడం, పూర్తి పేరు లేకపోవడం, కేవలం ఇనీషియల్‌తో పేరు ఉండటం లాంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. గతంలో ఆధార్ కార్డులో వివరాలు అప్‌డేట్ చేయడం కాస్త పెద్ద ప్రాసెస్ ఉండేది కానీ, ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోవడంతో సులువుగా ఆధార్ వివరాలు అప్‌డేట్ చేసుకుంటున్నారు..


ఒకప్పుడు ఇది కష్టం అయినా ఇప్పుడు మాత్రం ఇది సులువు అయ్యింది..మీరు కూడా మీ ఆధార్ కార్డుపై తప్పుగా ఉన్న పేరును సరిచేసుకోవాలని అనుకుంటున్నారా? చాలా సింపుల్. ఆన్‌లైన్‌లోనే కొన్ని వివరాలు అప్‌డేట్ చేయొచ్చు. పేరు, జెండర్, పుట్టిన తేదీ, అడ్రస్ లాంటి వివరాలు ఆన్‌లైన్‌లోనే అప్‌డేట్ చేయొచ్చు. ఒకవేళ మీ పేరు మార్చాలనుకుంటే ఏం చెయ్యాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఎలా అప్డేట్ చెయ్యాలో ఇప్పుడు చూద్దాం..

*. ముందుగా https://ssup.uidai.gov.in/ssup/ పోర్టల్ ఓపెన్ చేయండి.

*. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ చేయాలి.

*. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.

*. ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ కావాలి.

*. సర్వీసెస్ ట్యాబ్‌లో Update Aadhaar Online పైన క్లిక్ చేయాలి.

*. ఆ తర్వాత Proceed to Update Aadhaar పైన క్లిక్ చేయాలి.

ఇది ఇలా ఉంటే యూఐడీఏఐ 27 ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ డాక్యుమెంట్స్ అప్‌డేట్ కోసం అంగీకరిస్తుంది. వాటిపై పేరు, ఫోటో తప్పనిసరిగా ఉండాలి. పాస్‌పోర్ట్, పాన్ కార్డ్ , రేషన్ కార్డ్, ఓటర్ ఐడీ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఫోటో ఉన్న బ్యాంక్ ఏటీఎం కార్డ్, ఫోటో ఉన్న క్రెడిట్ కార్డ్ , కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రపాలిత ప్రాంతంలోని ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు జారీ చేసిన సర్వీస్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ లాంటి డాక్యుమెంట్స్అందించాలి..

Read more RELATED
Recommended to you

Latest news