ఎడిట్ నోట్: జనసేన గ్రాఫ్ పైకి.!

-

ఏపీ రాజకీయాల్లో ఊహించని ట్విస్టులు వస్తున్నాయి..అధికారంలో ఉన్న వైసీపీకి నిదానంగా వ్యతిరేక పరిస్తితులు ఎదురవుతున్నాయి. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది..ఏపీలో రాజకీయం మారిపోతుంది. ఇంతకాలం అధికార బలంతో ఉన్న వైసీపీపై వ్యతిరేకత పెరుగుతున్నట్లే కనిపిస్తుంది. గత ఎన్నికల్లో ఉన్న పరిస్తితి..ఇప్పుడు కనిపించడం లేదు. వైసీపీ గ్రాఫ్ నిదానంగా డౌన్ అవుతుంది. అయితే వైసీపీ గ్రాఫ్ డౌన్ అవుతుంటే..ప్రతిపక్ష టి‌డి‌పి గ్రాఫ్ అనుకున్న మేర పెరగడం లేదు..ఊహించని విధంగా జనసేన గ్రాఫ్ పెరడం విశేషం.

తాజా సర్వేల్లో కూడా అదే స్పష్టమవుతుంది. సర్వే వివరాలని చూసే ముందు గత ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు వచ్చిన ఓటు బ్యాంకు ఒక్కసారి పరిశీలిస్తే..గత ఎన్నికల్లో వైసీపీకి 49 శాతం పైనే ఓట్లు రాగా, టి‌డి‌పికి 39 శాతం పైనే ఓట్లు వచ్చాయి. ఇటు జనసేనకు 6 శాతం పైనే ఓట్లు పడ్డాయి. అంటే గత ఎన్నికల్లో పూర్తిగా వైసీపీ హవా నడిచింది. కానీ ఇప్పుడున్న పరిస్తితుల్లో సీన్ మారుతుంది. తాజాగా శ్రీ ఆత్మసాక్షి సర్వేలో ఊహించని ఫలితం వచ్చింది. ఫిబ్రవరి 17 వరకు చేసిన సర్వేలో టి‌డి‌పికి 78, వైసీపీకి 63, జనసేనకు 7 సీట్లు వస్తాయని తేలింది. 27 సీట్లలో వైసీపీ-టి‌డి‌పిల మధ్య టఫ్ ఫైట్ ఉంటుందని తేలింది.

ఇక టి‌డి‌పికి 42.5 శాతం ఓట్లు, వైసీపీకి 41.5 శాతం ఓట్లు..జనసేనకు 11 శాతం ఓట్లు వస్తాయని తేల్చి చెప్పింది. అంటే గత ఎన్నికలతో పోలిస్తే వైసీపీకి 8 శాతం ఓట్లు వరకు తగ్గగా..టి‌డి‌పికి 3 శాతం ఓట్లు వరకు పెరిగాయి. ఊహించని విధంగా జనసేనకు 5 శాతం ఓట్లు పెరిగాయి. అంటే ఇక్కడ జనసేన గ్రాఫ్ పెరుగుతుందనే చెప్పాలి. అదే సమయంలో ఒక  వైసీపీ ఎంపీ అంతర్గతంగా చేసిన సర్వేలో వైసీపీకి 42 శాతం పైనే ఓట్లు, టి‌డి‌పికి 41 శాతం..జనసేనకు ఏకంగా 12.5 శాతం ఓట్లు వస్తాయని తేలిందట. అంటే ఏపీలో జనసేన గ్రాఫ్ ఊహించని విధంగా పెరుగుతుందనే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news