టిడిపి అధినేత చంద్రబాబు రాజకీయాలని ఎప్పటికప్పుడు తనకు అనుకూలంగా మార్చుకోవడంలో ధిట్ట అని చెప్పొచ్చు. ఏదైనా ఒక అంశంలో చంద్రబాబు గతంలో అధికారంలో ఉండగా పట్టించుకోకుండా, ప్రతిపక్షంలోకి వచ్చాక అదే అంశంపై ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీపై విమర్శలు చేస్తుంటారు. ప్రస్తుతం చంద్రబాబు అదే పనిలో బిజీగా ఉన్నారు. గతంలో అధికారంలో ఉండగా చంద్రబాబు రైతులని ఏ మాత్రం పట్టించుకున్నారో అందరికీ తెలిసిందే.
ముఖ్యంగా రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి, మోసం చేశారు. ఏదో కొంతవరకు రుణమాఫీ చేసి చేతులు దులుపుకున్నారు. అలాగే రైతులకు సకాలంలో నీరు అందించడంలో గానీ, పంటలకు గిట్టుబాటు ధర అందించడంలో కూడా విఫలమయ్యారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అంశాల్లో చంద్రబాబు, రైతులకు న్యాయం చేయలేకపోయారు. ఇక ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్ ఏదొకవిధంగా రైతులకు న్యాయం చేసే పనిలో ఉన్నారు.
రైతు భరోసా పేరుతో రైతులకు ఏడాదికి రూ. 7,500 ఇస్తున్నారు. అటు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 6 వేలు అందుతున్నాయి. మొత్తం మీద రూ. 13,500 రైతులకు వస్తున్నాయి. అలాగే రైతులకు గిట్టుబాటు ధర అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. అటు 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. రూ.3వేల కోట్లతో ధరల స్థిరికరణ నిధి ఏర్పాటు చేశారు. ఇలా సాధ్యమైన మేర రైతులకు సాయం అందించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు.
ఏ ప్రభుత్వమైన రైతుల కష్టాలని తీర్చడం అంత తేలికైన పని కాదు. కానీ జగన్ తనకు సాధ్యమైన మేర పనులు చేస్తున్నారు. అదృష్టం ఏంటో గానీ జగన్ అధికారంలోకి వచ్చాక సకాలంలో వర్షాలు పడుతూ, సాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పోతుంది. అయితే ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు మాత్రం జగన్ ప్రభుత్వం రైతులని మోసం చేస్తుందని అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ టిడిపి చేసే ఈ ఆందోళనలకు రైతుల నుంచి స్పందన కరువైంది. ఏమైనా బాబు గురివింద రాజకీయాలు రైతులే నమ్మేలా లేరు.